రవితేజ ‘ఖిలాడి’ టీజర్ వీరలెవల్.. బ్యాక్‏గ్రౌండ్ మ్యూజిక్‏తోనే చింపేశాడు.. మరింత డేంజరస్‏గా మాస్ మాహారాజ్..

Khiladi Movie Teaser: మాస్ మాహారాజా రవితేజ ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు. ఇక అదే జోష్‏తో రమేశ్ వర్మ్ దర్శకత్వంలో 'ఖిలాడి' మూవీని

రవితేజ 'ఖిలాడి' టీజర్ వీరలెవల్.. బ్యాక్‏గ్రౌండ్ మ్యూజిక్‏తోనే చింపేశాడు.. మరింత డేంజరస్‏గా మాస్ మాహారాజ్..
Khiladi


Khiladi Movie Teaser: మాస్ మాహారాజా రవితేజ ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు. ఇక అదే జోష్‏తో రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీని పట్టాలెక్కించేసిన సంగతి తెలిసిందే. డా. జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ పోస్టర్స్‏తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్న మేకర్స్.. తాజాగా విడుదల చేసిన టీజర్‏తో అంచనాలను మరింత పెంచేశారు.

ఉగాది పండుగ కానుగా ఖిలాడి టీజర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ వీడియో చూస్తుంటే.. రవితేజ మరింత స్టైలీష్ లుక్‏లో కనిపించనున్నాడు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా.. కేవలం బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్‏తోనే మరింత ఆసక్తిని పెంచేశారు. ‘ఇఫ్‌ యు ప్లే స్మార్ట్‌ విత్‌ అవుట్‌ స్టుపిడ్‌ ఎమోషన్స్‌ యు ఆర్‌ అన్‌స్టాపబుల్‌’ అనే రవితేజ డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. ఈ సినిమాలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు మాస్ మాహారాజను చూడని షేడ్‏లో రవితేజను చూపించనున్నట్లుగా టీజర్‏తోనే హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. మే 28న ‘ఖిలాడి’ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇక రవితేజ ఈ సినిమాతోపాటు త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో, అలాగే మారుతి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు.

వీడియో..

Also Read: మళ్లీ పోటీపడుతున్న కమల్, రజనీ.. దాదాపు 16 ఏళ్ళ తర్వాత సీన్ రిపీట్.. అభిమానులకు ఇక పండగే..

Akkineni Naga Chaitanya: ఇక్కడ సినిమా పూర్తిచేసుకున్న ‘థ్యాంక్యు’.. ఇటలికి పయనమైన నాగచైతన్య…

ఫ్యాన్స్ బీ రెడీ.. ఆ సినిమాపై బిగ్ అనౌన్స్‏మెంట్ ఇవ్వనున్న మేకర్స్.. ఆ స్టార్ హీరోల చిత్రాలపై స్పష్టత..