Curd: చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
భోజనం చివర్లో చాలా మందికి పెరుగు తినే అలవాటు ఉంటుంది. పెరుగుతో భోజనం చేయకపోతే ఆహారం తిన్న ఫీలింగ్ కలగదు. ఇక కొందరు పెరుగు లేకపోతే కనీసం మజ్జిగతో అయినా సరిపెట్టుకుంటారు. అయితే పెరుగును తినడం వల్ల అది.. జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెరుగును తింటే క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకలను, నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చలికాలం రాత్రిపూట పెరుగును తినాలా.. వద్దా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఆయుర్వేద వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగును తింటే సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుందట. పెరుగులో కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పూట పెరుగు తింటే సమస్యలు ఇంకా ఎక్కువవుతాయని అంటున్నారు. దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు లేదా తరచూ ఈ సమస్యల బారిన పడేవారు రాత్రి పూట.. అందులోనూ చలికాలంలో రాత్రి పూట పెరుగును తింటే మ్యూకస్ ఇంకా ఎక్కువై సమస్యలు మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఎలాంటి సమస్యలు లేని వారు ఎప్పుడైనా సరే పెరుగును తినవచ్చు. కానీ పెరుగులో కొవ్వు లేకుండా ఉంటే మంచిది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు గడ్డ పెరుగు తినకూడదు. అందులో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. కొవ్వు తీసిన పాలతో తయారు చేసిన పెరుగును తినాలని నిపుణుల సూచిస్తున్నారు.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు పెరుగును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదికూడా మధ్యాహ్నం పూట తింటేనే మంచిదని సూచిస్తున్నారు. పెరుగును తింటే జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నిర్మాణానికి సహాయం చేస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. శిరోజాలను సంరక్షిస్తాయి. ఈ విధంగా పెరుగుతో అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.