Top Song Of 2024: కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్ సాంగ్.!
‘కుర్చీ మడతపెట్టి’ నుంచి ‘కిస్సిక్’ వరకూ ఈ ఏడాది ఎన్నో పాటలు విడుదలయ్యాయి. అందులో కొన్ని విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుని యూట్యూబ్‌ను షేక్ చేశాయి. అలా తమ ప్లాట్‌ఫామ్‌లో టాప్‌లో నిలిచిన పాటల జాబితాను తాజాగా యూట్యూబ్ విడుదల చేసింది. ఏ దేశాల నుంచి ఏ పాట టాప్‌లో ఉందో తెలియజేసింది. కేండ్రిక్ లామర్ ఆలపించిన ‘నాట్ లైక్ అజ్’ యూఎస్‌లో టాప్‌లో నిలిచింది.
ఇండియా నుంచి ఆ జాబితాలో నిలిచిన ఏకైక పాట ‘కుర్చీ మడతపెట్టి’ అని ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఈ ఏడాది ఎన్నో పాటలు విడుదలయ్యాయి. వాటన్నింటిని పక్కకు నెట్టి ‘కుర్చీ మడతపెట్టి’ పాట టాప్‌లో నిలవడంపై సంగీత దర్శకుడు తమన్, నటి శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘గుంటూరు కారం’ టీమ్ అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. చిత్రబృందంతోపాటు తమ పాటను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. దీనిపై తెలుగు సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంలోనిదే ఈ పాట. త్రివిక్రమ్ దర్శకుడు. యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌గా ‘కుర్చీ మడతపెట్టి’ చిత్రీకరించారు. మహేశ్‌బాబు, శ్రీలీల హై వోల్టేజ్ స్టెప్పులు, పూర్ణ అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. శ్రీ కృష్ణ, సాహితి దీనిని ఆలపించారు. శేఖర్ మాస్టర్ దీనికి స్టెప్పులు కంపోజ్ చేశారు. యూట్యూబ్‌లో ఈ ఫుల్ వీడియో సాంగ్ 526 మిలియన్ల అంటే దాదాపు 52 కోట్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.