Tirumala: శ్రీవారి మెట్టు దగ్గర  దర్శనం టోకెన్ల దందా.! చివరికి ఆటో డ్రైవర్స్ కూడానా.?

Tirumala: శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా.! చివరికి ఆటో డ్రైవర్స్ కూడానా.?

Anil kumar poka

|

Updated on: Jan 01, 2025 | 5:21 PM

తిరుమలలో దళారులకు చెక్‌ పెట్టేందుకు TTD విజిలెన్స్‌ ఎంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నా.. భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కొందరి దందా కంటిన్యూ అవుతూనే ఉంది. తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర ఆటో డ్రైవర్లతో రింగైన కొందరు TTD సిబ్బంది.. టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీలో ఇష్టాతీరిన వ్యవహరిస్తున్నారని భక్తులు భగ్గుమంటున్నారు.

తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ టైమ్‌స్లాట్‌ దర్శన టోకెన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా దళారులకే టికెట్లు దక్కుతున్నాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారిమెట్టు దగ్గర రోజూ 3 వేల టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ. ఇక్కడే దళారుల దందా మొదలవుతుంది అని భక్తుల ఆరోపిస్తున్నారు. కొందరు ఆటో డ్రైవర్లు.. తాము తీసుకువస్తున్న భక్తులకు.. నిర్ణీత సమయం దాటినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని చెప్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్నవారిని కాదని దొడ్డిదారిన ఆటోవాలాలతో డీల్‌ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్‌ చేయడంలోనూ, క్యూలైన్‌లలోని ఏర్పాట్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు.

కొందరు టీటీడీ సిబ్బంది సహకారంతో, ఇక్కడ ఆటో డ్రైవర్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై నిలదీసినా తమకు సరైన సమాధానం రావడం లేదని భక్తులు చెబుతున్నారు. వీకెండ్‌లు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. శ్రీవారి మెట్టుమార్గం మీదుగా కొండకు వెళ్లేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. తెల్లవారుజామునుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుని నిరీక్షించినా ముందు వచ్చిన వారిని కాదని.. ఆటోల్లో వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.