AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niloufer Doctors: సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు… ఏం జరిగిందంటే..

శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరు రోజులపాటు కార్పొరేట్ ఆసుపత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దీంతో సూడాన్ దంపతుల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోవడంతో శిశువును నిలోఫర్ కు రిఫర్ చేసిన వైద్యులు. శిశువును అడ్మిట్ చేసుకున్న నిలోఫర్ డాక్టర్లు నెల రోజులపాటు పూర్తి ఉచితంగా చికిత్స అందించారు.

Niloufer Doctors: సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
Sudanese Newborn
Sridhar Rao
| Edited By: |

Updated on: Jan 01, 2025 | 10:23 PM

Share

సూడాన్ దేశానికి చెందిన ఓ శిశువుకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అత్యంత విషమ శిశువు పరిస్థితి పరిస్థితుల్లో ఉండడంతో సుమారు నెల రోజులపాటు నిలోఫర్ లో పూర్తి ఉచితంగా వైద్యం అందించారు. సూడాన్ దేశానికి చెందిన దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు సంవత్సరం క్రితం హైదరాబాద్ కు వచ్చారు. ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో సయీదా అబ్దుల్ వాహెద్ అనే మహిళ ఐవీఎఫ్ చేయించుకుని నెలరోజుల క్రితం మగ పిల్లాడికి జన్మనిచ్చింది. శిశువుకు పుట్టుకతోనే బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు.

శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరు రోజులపాటు కార్పొరేట్ ఆసుపత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దీంతో సూడాన్ దంపతుల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోవడంతో శిశువును నిలోఫర్ కు రిఫర్ చేసిన వైద్యులు. శిశువును అడ్మిట్ చేసుకున్న నిలోఫర్ డాక్టర్లు నెల రోజులపాటు పూర్తి ఉచితంగా చికిత్స అందించారు. శిశువు తల్లిదండ్రులకు భోజన వసతి కుడా ఏర్పాటు చేశారు. శిశువు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు నీలోఫర్ వైద్యులు.

తన బిడ్డను బతికించిన డాక్టర్లకు ఆ తల్లి (43 ఏళ్లు) కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఇప్పటికే ఐదుసార్లు అబార్షన్ అయిందని, ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం తపించామని ఆమె తెలిపారు. చావుబతుకుల్లో ఉన్న తన బిడ్డకు నిలోఫర్ వైద్యులు పున ర్జన్మను ప్రసాదించారన్నారు. విషమ పరిస్థితిలో ఉన్న శిశువుకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ల బృందాన్ని, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్.వి. కర్జన్ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్