AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ మానసిక అశాంతికి కారణాలివే! ఇలా చెక్ పెట్టండి

ఇటీవల కాలంలో చాలా మంది మానిసక ప్రశాంతతకు దూరమవుతున్నారు. ఎలాంటి కారణం లేకపోయినప్పటికీ ఆందోళనకు గురవుతుంటారు. వారి మనస్సు చంచలత్వానికి గురవుతూ ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో కొన్ని గ్రహాల స్థితిగతుల కారణంగానే మానసిక అశాంతి చోటు చేసుకుంటుంది. ఇందుకు పలు నివారణ ఉపాయాలను కూడా జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

మీ మానసిక అశాంతికి కారణాలివే! ఇలా చెక్ పెట్టండి
Planets Effect On Mind
Rajashekher G
|

Updated on: Dec 28, 2025 | 5:44 PM

Share

నేటి ఆధునిక యుగంలో చాలా మంది కారణం లేకుండానే మానసిక అశాంతికి, ఆందోళనకు గురవుతుంటారు. కొందరిలో జీవనశైలి, ఆహారం, ఇతర అంశాలు కూడా ఇందుకు కారణమవుతుంటాయి. అయితే, కొన్నిసార్లు అన్ని బాగానే ఉన్నప్పటికీ మనస్సు ఆందోళనగా ఉంటుంది. ఇందుకు వారి జాతకంలో కొన్ని గ్రహాల స్థానం కారణమై ఉండవచ్చని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మానసిక అశాంతి, మనస్సు చంచలత్వానికి కారణమయ్యే గ్రహాలు, వాటిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూద్దాం.

మనస్సుకు యజమాని చంద్రుడు.. అశుభ స్థానంలో ఉంటే

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు కారకుడిగా పరిగణిస్తారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా, నీచ స్థితిలో ఉంటే లేదా ఆరవ, ఎనిమిదవ, పన్నెండవ ఇంట్లో ఉంటే.. ఆ వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తులు చిన్న విషయాలకే భావోద్వేగానికి గురవుతారు. వారిలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది.

రాహు-కేతువుల ప్రభావం:

రాహు-కేతువులను ఛాయా గ్రాహాలుగా పరిగణిస్తారు. అవి చంద్రునితో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అది గ్రహాణానికి కారణమవుతుంది. రాహువు తెలియని దాని గురించి భయం, ఆందోళన, ప్రతికూల ఆలోచనలను కలిగిస్తాడు. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఏదో చెడు జరగబోతోందని ఆందోళన చెందుతాడు. ఇక, కేతువు ఒక వ్యక్తిని ప్రపంచం నుంచి వేరే చేసి గందరగోళానికి గురిచేస్తాడు. ఇది ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.

శని: నిరాశ, ఒంటరితనం శని దేవుడిని క్రమశిక్షణ, కర్మ ఫలాలను ప్రసాదించే వ్యక్తిగా భావిస్తారు. అయితే, శని, చంద్రుడు కలిసినప్పుడు విష యోగం ఏర్పడుతుంది. ఈ యోగం తీవ్ర నిరాశ, ఒంటరితనానికి దారితీస్తుంది. వ్యక్తి ఒంటరిగా, మనస్సులో భారంగా భావిస్తాడు.

బుధుడు: వానదలు, చింతలు బుధుడు తెలివితేటలకు కారకుడు. బుధుడు బాధపెడితే ఆ వ్యక్తి అతిగా ఆలోచిస్తాడు. తన సొంత ఆలోచనలను పునరావృతం చేయడం, అనవసరంగా చింతించడం బలహీనమైన బుధుడికి సంకేతాలుగా చెప్పుకోవచ్చు.

మానసిక ప్రశాంతకు జ్యోతిష్య పరిహారాలు

చంద్రుడికి జలం: పౌర్ణమి రోజున చంద్రునికి నీటిని కలిపిన పాలను సమర్పించండి. ఓం సోం సోమే నమ: అని జపించండి. వెండి: చేతి చిటికెన వేలుకు వెండి ఉంగరం ధరించండి లేదా వెండి గ్లాసులో నీరు తాగండి. శివారాధన: శివుడు మనసును నియంత్రించే దేవుడు. ప్రతిరోజూ శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమ: శివాయ అని జపించండి. ప్రాణాయామం, ధ్యానం: ధ్యానం, అనులోమ-విలోమ అనేవి గ్రహాల దుష్ప్రభావాలను తగ్దించడానికి అత్యంత ప్రభావంతమైన మార్గాలు. తెల్లని వస్తువుల దానం: సోమవారం పాలు, బియ్యం లేదా తెల్లని స్వీట్లు దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్ర పరిజ్ఞానం ఆధారంగా అందించడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.