Telangana News: ఆడ తోడు కోసం ఎంట్రీ ఇచ్చింది.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది

కొమురంభీం జిల్లా సరిహద్దులో అటవిశాఖ అధికారులకు ఎట్టకేలకు పులి చిక్కింది. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో 30 గ్రామాలను‌ మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెట్టిన పులిని మహారాష్ట్ర అటవీశాఖ రెస్క్యూ‌ టీం ఎట్టకేలకు పట్టుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు రెస్క్యూ చేసి మత్తు మందు‌ ఇచ్చి పులిని బంధించారు.

Telangana News: ఆడ తోడు కోసం ఎంట్రీ ఇచ్చింది.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
Tiger
Follow us
Naresh Gollana

| Edited By: Velpula Bharath Rao

Updated on: Jan 01, 2025 | 9:53 PM

మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో 30 గ్రామాలను‌ మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెట్టిన మ్యాన్ ఈటర్‌ను‌ మహారాష్ట్ర అటవీశాఖ రెస్క్యూ‌టీం ఎట్టకేలకు పట్టుకున్నారు. కొమురంభీం జిల్లా సరిహద్దు సిర్పూర్ మండలం మకాడి కి సమీపంలోని మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజురా తాలుక అంతర్గాం – అత్మారాం గూడ అభయారణ్యంలో పులిని పారెస్ట్ రెస్క్యూ టీం బంధించారు. దాదాపు నాలుగు గంటల పాటు రెస్క్యూ చేసి మత్తు మందు‌ ఇచ్చి పులిని బంధించారు. అంతర్గాం సమీపంలో పశువు పై దాడి చేసి మాంసం తింటున్న పులిని గుర్తించిన షార్ప్ షూటర్ .. ట్రాంక్విలైజర్లు చేసి పులిని బంధించారని మహారాష్ట్ర అటవీశాఖ పేర్కొంది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పది మంది నిపుణుల బృందం పాల్గొనట్టు సమాచారం.

బోనుకు చిక్కిన పులి.. గత నెల రోజుల క్రితం కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం నజ్రూల్ నగర్‌లో వ్యవసాయ కూలిని హతమార్చి మహారాష్ట్ర వైపు వెళుతూ 24 గంటల వ్యవదిలోనే సిర్పూర్ మండలం దుబ్బగూడాలో సురేష్ అనే రైతుపై దాడి చేసిన పులిగా మహారాష్ట్ర ప్రాథమికంగా నిర్దారించింది. పులి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్టు పేర్కొంది. పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత టైగర్ రెస్క్యూ ఆపరేషన్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎట్టకేలకు మ్యాన్ ఈటర్ బోనుకు చిక్కడంతో అటు రాజురా తాలూక ఇటు కాగజ్ నగర్, సిర్పూర్ మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆడ తోడు కోసం కొమురంభీం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చి ఇటిక్యల్ పాడ్‌లో ఆడ పులితో మేటింగ్‌లో పాల్గొన్న మగ పులిని బంధించడంపై అటవీశాఖ నిపుణులు తప్పుపడుతున్నారు. పులిని బంధించడం అంటే పులుల సంతతిని అడ్డుకోవడమే జంతు ప్రేమికులు అంటున్నారు. బంధించిన మ్యాన్ ఈటర్‌ను చంద్రపూర్‌లోని టైగర్ కేర్ సెంటర్‌కు తరలించినట్టు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి