AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman : జైలులో ఉన్నప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్లే అండగా ఉన్నారు.. హీరో సుమన్..

ఒకప్పుడు హీరోగా వరుస విజయాలను అందుకున్నారు సుమన్. కానీ అనుహ్యంగా అతడి కెరీర్ మారిపోయింది. స్టార్డమ్ వస్తున్న తొలి రోజుల్లోనే ఊహించని కేసులో అరెస్టై జైలులో చిక్కుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్.. తన జీవితంలో ఎదుర్కొన్న కఠినమైన కాలాన్ని, జైలు అనుభవాలను వివరించారు. స్టార్‌డమ్ పొందిన తర్వాత అనుకోని సంఘటనలు, ఆరు నెలల జైలు జీవితం, అక్కడ కలిగిన మానసిక క్షోభ, కర్మ సిద్ధాంతంపై ఆయనకున్న నమ్మకం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Suman : జైలులో ఉన్నప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్లే అండగా ఉన్నారు.. హీరో సుమన్..
Suman
Rajitha Chanti
|

Updated on: Dec 27, 2025 | 1:10 PM

Share

సీనియర్ హీరో సుమన్.. ఒకప్పుడు హీరోగా అనేక విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం సహయ నటుడిగా రాణిస్తున్నారు. ఒకప్పుడు అసాధారణమైన స్టార్‌డమ్ సంపాదించుకున్న తర్వాత ఊహించని విధంగా నీలిరంగు చిత్రాల కేసులో ఇరుక్కున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి, రాత్రికి రాత్రి స్టార్‌గా మారిన తర్వాత అనుకోకుండా ఓ కేసులో చిక్కుకుని ఆరు నెలలు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో భగవంతుడిపై తనకున్న నమ్మకం తనను నిలబెట్టిందని తెలిపారు. తనను ప్రతి రోజు సెల్ మారుస్తూ క్లోజ్డ్ ప్రిజన్లో ఆటో శంకర్ వంటి పెద్ద నేరస్థులతో తనను కూడా ఒకే గదిలో ఉంచారని గుర్తుచేసుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కరుణానిధి జోక్యంతో తనను సాధారణ ఖైదీల రూంలోకి మార్చారని మార్షల్ ఆర్ట్స్, ధ్యానం తనను మానసికంగా, శారీరకంగా బలపరిచాయని ఆయన తెలిపారు. షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాక తనకు ఇద్దరు హీరోయిన్లుగా అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. ” జైలు జీవితం ఆరు నెలలు సాగింది. ప్రారంభంలో స్నేహాలు ఏర్పడకుండా ఉండేందుకు ప్రతిరోజు సెల్ మార్చేవారు. ఆ తర్వాత, క్లోజ్డ్ ప్రిజన్లో ఆటో శంకర్, 12 మంది కుటుంబ సభ్యులను హత్య చేసిన మరో వ్యక్తి వంటి ప్రమాదకరమైన నేరస్థులతో నాకు చోటు కల్పించారు. అప్పటి తమిళనాడు ప్రతిపక్ష నేత కరుణానిధిని జైలులో వేశారు. అక్కడ హంతకుల మధ్యలో నన్ను చూసి.. నాకు సాధారణ సెల్‌కు మార్చమని పోరాడారు. ఖైదీలకు అద్భుతమైన ఆహారం, సరైన వసతులు ఉండేవి, ఇతర ఖైదీలు కూడా చక్కగా చూసుకున్నారు. షరతులతో కూడిన బెయిల్‌పై అక్టోబరు 1వ తేదీన విడుదలయ్యాను. ఆ త్రవాత ఈ కేసు అబద్ధమని కొట్టేశారు” అని చెప్పుకొచ్చారు.

జైలులో ఉన్న సమయంలో తనకు హీరోయిన్లు సుహాసిని , సుమలత మద్దతు తెలిపారని.. ఆ ఇద్దరు తన కోసం మాట్లాడారని అన్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి సుమన్ అలా వ్యక్తి కాదని. తనకు ఎంతో ధైర్యం చెప్పారని గుర్తుచేసుకున్నారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి కూడా అనూహ్యమైన మద్దతు లభించిందని తెలిపారు. హీరోయిన్ సుమలత కుటుంబం, ఆమె తల్లి, సోదరి జైలు వద్దకు వచ్చి తనను రిసీవ్ చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం మోహన్ బాబు వచ్చి సుమన్‌కు పూలదండ వేసి, “శిరిడీ సాయిబాబా ఆశీర్వాదాలతో మళ్లీ నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి వస్తావు. భయపడొద్దు, నీ సీటు నీకే వస్తుంది” అని ధైర్యం చెప్పారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుమన్ సినిమాల్లో కీలకపాత్రలతోపాటు సీరియల్స్ సైతం చేస్తున్నారు.

Suhasini, Sumalatha

Suhasini, Sumalatha

ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..

మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..