Vijay Hazare Trophy : కోహ్లీనే దాటేశారు..విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్-5 రన్ మెషీన్లు వీరే!
Vijay Hazare Trophy : ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో విజయ్ హజారే ట్రోఫీ మంటలు పుట్టిస్తోంది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 208 పరుగులు (131, 77) చేసి ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, ఐదుగురు కుర్రాళ్లు మాత్రం ఆయన కంటే వేగంగా పరుగుల వరద పారిస్తున్నారు.

Vijay Hazare Trophy : ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో విజయ్ హజారే ట్రోఫీ మంటలు పుట్టిస్తోంది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 208 పరుగులు (131, 77) చేసి ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, ఐదుగురు కుర్రాళ్లు మాత్రం ఆయన కంటే వేగంగా పరుగుల వరద పారిస్తున్నారు. కోహ్లీ రికార్డులను కూడా దాటేసి, పరుగుల వేటలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న ఆ పంచ పాండవులు ఎవరో చూద్దాం.
1. దేవదత్ పడిక్కల్ (కర్ణాటక): కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ప్రస్తుతం బీస్ట్ మోడ్‌లో ఉన్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రెండు సెంచరీలు బాదిన పడిక్కల్, ఏకంగా 271 పరుగులతో టేబుల్ టాప్‌లో ఉన్నాడు. ఇతని సగటు 135.50 కాగా, స్ట్రైక్ రేట్ 106గా ఉంది. 22 ఫోర్లు, 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
2. ధ్రువ్ షోరే (విదర్భ): విదర్భ బ్యాటర్ ధ్రువ్ షోరే రన్ మిషన్లా మారిపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీలు బాది 245 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇతని సగటు 245 కావడం విశేషం (ఒక ఇన్నింగ్స్‌లో నాటౌట్). 27 ఫోర్లు, 6 సిక్సర్లతో షోరే విదర్భకు వెన్నెముకలా నిలుస్తున్నాడు.
3. సమర్ గజ్జర్ (సౌరాష్ట్ర): సౌరాష్ట్రకు చెందిన సమర్ గజ్జర్ రెండు మ్యాచ్‌ల్లో 215 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ బాదిన ఇతని బెస్ట్ స్కోరు 132 (నాటౌట్). నిలకడగా ఆడుతూ సౌరాష్ట్ర విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
4. ఆర్యన్ జుయల్ (ఉత్తరప్రదేశ్): యూపీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ జుయల్ తన బ్యాటింగ్ పవర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 214 పరుగులు జోడించి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇతను కూడా ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ బాదాడు. 16 ఫోర్లు, 9 సిక్సర్లతో బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు.
5. స్వస్తిక్ పీపీ సమల్ (ఒడిశా): ఒడిశా బ్యాటర్ స్వస్తిక్ సమల్ తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ, తొలి మ్యాచ్ పరుగుల పుణ్యమా అని 212 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఏది ఏమైనా కోహ్లీ 208 పరుగుల మార్కును ఈ ఐదుగురు యువ ఆటగాళ్లు అధిగమించడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
