విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో సెంచరీ, రెండో మ్యాచ్‌లో కీలక 77 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నా, అతనికి కేవలం ₹10,000 నగదు బహుమతి లభించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇది సరైనదే అయినా, నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన ఫామ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై సెంచరీ బాదిన విరాట్, గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరులోని అలుర్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ కేవలం 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 126గా ఉండటం విశేషం. కోహ్లీతో పాటు రిషబ్ పంత్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 254 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ జట్టును 247 పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ, 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అయితే, అతనికి నగదు బహుమతిగా కేవలం రూ. 10,000 మాత్రమే అందజేశారు. కోట్లాది రూపాయల ఆస్తులు, వందల కోట్ల సంపాదన ఉన్న విరాట్ కోహ్లీ చేతిలో రూ. 10 వేల చెక్కును చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ… ఒక దిగ్గజ ఆటగాడికి ఇంత తక్కువ బహుమతి ఇవ్వడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. “కోహ్లీ కారు సర్వీసింగ్‌కు కూడా ఈ డబ్బు సరిపోదని ఒకరు… బీసీసీఐకి అంత కరువు వచ్చిందా అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, దేశవాళీ క్రికెట్ నిబంధనల ప్రకారం విజయ్ హజారే ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు నిర్ణీత బహుమతి రూ. 10 వేలే ఉంటుంది. కానీ, కోహ్లీ లాంటి అంతర్జాతీయ స్టార్ ఆడుతున్నప్పుడు ఈ మొత్తం చాలా చిన్నదిగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

