AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ... కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

Phani CH
|

Updated on: Dec 27, 2025 | 9:15 PM

Share

2004 సునామీ విషాదం తర్వాత, భవిష్యత్ విపత్తుల నుండి తీర ప్రాంతాలను రక్షించేందుకు యునెస్కో కృషి చేస్తోంది. 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం సముద్రాన్ని రాకాసిగా మార్చి, ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మందిని బలిగొంది. నాటి గుణపాఠాలతో, తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు సునామీ, తుపాన్లను సమర్థంగా ఎదుర్కొనేలా యునెస్కో శిక్షణ ఇస్తోంది. ఒడిశాలోని కొన్ని గ్రామాలు 'సునామీ-రెడీ' గుర్తింపును పొందాయి.

అది ఒక ఆదివారం ఉదయం. క్రిస్మస్ సంబరాల మరుసటి రోజు కావడంతో అందరూ సెలవు మూడ్‌లో ఉన్నారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళితే , పర్యాటకులు సముద్ర అందాలను చూస్తూ మురిసిపోతున్నారు. కానీ, సరిగ్గా ఉదయం 8 గంటల సమయంలో ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో సంభవించిన 9.1 తీవ్రత కలిగిన భూకంపం.. భూగోళాన్ని గడగడలాడించింది. నిమిషాల వ్యవధిలోనే శాంతంగా ఉండే సముద్రం ‘రాకాసి’గా మారింది. ఈ సునామీ ధాటికి భారతదేశమే కాదు, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండోనేషియా సహా మొత్తం 14 దేశాలు అల్లాడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,30,000 మంది కడలి గర్భంలో కలిసిపోయారు. బుల్లెట్ రైలు కంటే వేగంగా దూసుకొచ్చిన రాకాసి అలలు నిమిషాల వ్యవధిలోనే జనవాసాలను స్మశానాలుగా మార్చేశాయి. నాటి విషాదాల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో సునామీ వంటి విపత్తు వస్తే తీర ప్రాంత ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలనే అంశంపై యునెస్కో చొరవ తీసుకుంది. భారత్‌లోని అనేక తీర ప్రాంతాలు సునామీ ముప్పును ఎదుర్కుంటున్నాయి. సునామీ వచ్చి 21 ఏళ్లు గడిచింది. అయితే.. మరోసారి అలాంటి విపత్తు వస్తే సమర్థంగా ఎదుర్కోవడానికి గ్రామస్తులలో పూర్తిస్థాయి సన్నద్ధత కోసం యునెస్కో కార్యక్రమం నిర్వహిస్తోంది. వేట పడవలు, వలలు కొట్టుకుపోయి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోకుండా సునామీ-రెడీ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇచ్చింది. దాదాపు వంద గ్రామాల ప్రజలకు సునామీ, తుపాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఎలా స్పందించాలి? ప్రాణనష్టాన్ని ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించాలన్న దాని పై శిక్షణ ఇచ్చింది. ఒడిశాలోని కొన్ని తీర ప్రాంత గ్రామాలు తాజాగా యునెస్కో-ఇంటర్‌గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ వారి గుర్తింపు సర్టిఫికేట్ అలాగే వర్చువల్ ఈవెంట్‌లో అవార్డులను అందుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే

బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??