ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్ డల్.. బాలీవుడ్ ఫుల్
ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కూడా ₹1000 కోట్ల క్లబ్‌లో చేరలేదు. అయితే, కొన్ని చిత్రాలు ₹500 కోట్ల మార్కును దాటి భారీ విజయాలు సాధించాయి. ఆసక్తికరంగా, ఈ జాబితాలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. పవన్ కల్యాణ్ 'ఓజీ' ₹320 కోట్లతో తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 'ఛావా', 'కూలీ', 'కాంతార: చాప్టర్ 1' వంటి చిత్రాలు ₹500 కోట్లు వసూలు చేశాయి.
మరికొన్ని రోజుల్లో 2025 ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుత్నారు. ఈ సంవత్సరం చాలా సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. కానీ ఈ సంవత్సరం ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరలేదు. 500+ క్రోర్ క్లబ్‌లోకి మాత్రం ఓ నాలుగైదు సినిమాలు చేరాయి. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే… ఈ జాబితాలో అసలు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ అంటే పవన్ కల్యాణ్ ఓజీ మాత్రమే. ఓవరాల్ గా ఈ మూవీ రూ.320 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 2025లో రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాల్లో మొదటిది చావా.. విక్కీ కౌశల్, రష్మిక మందన్న తదితరులు నటించిన ‘ఛావా’ చిత్రం ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 807 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను అద్బుతంగా పోషించాడు విక్కీ కౌశల్. ఇక సౌత్ నుంచి 500 కోట్ల క్లబ్‌లో చేరిన మరో సినిమా కూలీ.. రజనీకాంత్ నటించిన ‘కూలీ’ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. టేకింగ్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 500+ కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది భారీ విజయం సాధించిన బాలీవుడ్ చిత్రం ‘సైయర్’. ఈ మూఈ కూడా రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో అనిత్ పద్దా అహన్ పాండే నటించారు జంటగా నటించారు.. ఇద్దరూ కొత్త ముఖాలు అయినప్పటికీ, ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా వసూళ్లు దాదాపు 900 కోట్ల రూపాయలు. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్.ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే. ధురందర్ రెండు వారాల్లో రూ. 400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్ ఇప్పటికే రూ. 500 కోట్లు దాటింది. ఇందులో రణవీర్ సింగ్ నటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టులు
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో

