Hyderabad: ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
రోజురోజుకూ ఆన్‌లైన్ గేమ్స్ బాధితులు పెరిగిపోతున్నారు. ఆన్‌లైమింగ్స్‌లో డబ్బులు పెట్టి అప్పులపాలై వాటని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాగాజా ఈ ఆన్‌లైన్ గేమింగ్ భూతానాకి మరో యువకుడు బలయ్యాడు. తాను ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోయానని.. వీడియో రికార్డ్ తీసుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆన్‌లైన్ గేమ్స్.. యువత పాలిన మృత్యువులుగా మారుతున్నాయి. కష్టపడుకుండా ఈజీగా డబ్బులు సంపాదించొచ్చని వల వేసి వినియోగదారులను నిండా ముంచేస్తున్నాయి. లాభాలు వస్తాయని ఆశించి.. భారీగా పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు జనాలు. ఆన్‌గేమింట్ పెట్టేందుకు అప్పుగా తెచ్చిన డబ్బులు కట్టలేక.. ఒత్తిడికి గురైన చివరకు ప్రాణాలు వదిలిస్తున్నారు. దీని కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి, ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీటికి బానిసలు అయ్యే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. . తాగాజా ఈ ఆన్‌లైన్ గేమింగ్ భూతానాకి మరో యువకుడు బలయ్యాడు. తాను ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోయానని.. వీడియో రికార్డ్ తీసుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్‌లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రవీందర్ అనే 24 ఏళ్ల యువకుడు గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారింది. దీంతో ఈజీగా డబ్బులు వస్తాయని నమ్మి అప్పులు తెచ్చి మరీ భారీగా పెట్టుబడుతు పెట్టాడు. చివరకు నిండా మునిగిపోయాడు. ఇక ఈ ఒత్తిడిని తట్టుకోలేక చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే చనిపోయే ముందు రవీందర్ ఒక వీడియో కూడా రికార్డ్ చేశారు. తన చావుకు ఎవరు బాధ్యులు కాదని, ఆన్‌లైన్ గేమ్స్ భారీగా పెట్టుబడి పెట్టి మోసపోయానని పేర్కొన్నాడు. రవీందర్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
