AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!

జనవరి వచ్చిందంటే చాలు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇక ఈ మాసం, ప్రయాణాలకు అద్భుతమైన సమయం అని చెప్పాలి. అందుకే చాలా మంది ఈ మంత్‌లో ఎక్కువగా టూర్ వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అయితే మీరు కూడా జనవరిలో ఎక్కడికైనా వెళ్లి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? ఆనందంగా గడపాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం. దక్షణ భారత దేశంలో జనవరిలో చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయంట. ఆహ్లాదకరమై వాతావారణం ఉన్న ఆ ప్రదేశాలు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Dec 27, 2025 | 1:32 PM

Share
మున్నార్ , కేరళ : జనవరిలో చూడాల్సిన ప్రదేశాల్లో మున్నార్ కేరళ ఒకటి. ఈ మంత్‌లో ఇక్కడి ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చల్లటి ఉదయాలు, పొగమంచుతో కప్పబడిన అందమైన కొండలు, విస్తారమై టీ తోటలు, గల గలపారే జలపాతాలు, ఎరువికులం జాతీయ ఉద్యానవనం, అద్భుతమైన తోటలతో చాలా అందంగా ఉంటాయి. అయితే ఎవరు అయితే జనవరిలో టూర్ ప్లాన్ చేస్తున్నారో, వారికి అద్భుతమైన ప్రదేశం కేరళ అని చెప్పవచ్చు.

1 / 5
ఊటీ, తమిళనాడు : అందమైన ప్రదేశాల్లో ఊటీ కూడా ఒకటి. చాలా మంది ఊటీ వెళ్లడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతుంటారు. అయితే నీలగిరి రాణిగా పిలవబడే, ఊటీ జనవరిలో చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. శీతాకాలపు పగలు, చల్లని రాత్రులు, బొటానికల్ గార్డెన్స్, యూకలిప్టస్ అడవులు, కొండలు, ట్రైన్ ప్రయాణం, మంచి అనుభూతిని ఇస్తుంది.

2 / 5
కూర్గ్, కర్ణాటక : కర్ణాటకలో ఉన్న బెస్ట్ ప్లేసెస్‌లో కూర్గ్ ఒకటి. ఇక్కడి వాతావరణం ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటుంది. అందమైన కాఫీ తోటలు, నదులు, అబ్బరపరిచే జలపాతాల వంటివి ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంటాయి. ఈ జనవరిలో కూర్గ్‌కు ఫ్యామిలీతో, స్నేహితులతో ఎవరితో వెళ్లి ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా ఉంటుందంట.

3 / 5
పుదుచ్చేరి : పుదుచ్చేరి కూడా జనవరిలో చూడాల్సిన బెస్ట్ ప్లేస్. చాలా మంది న్యూ ఇయర్ సమయంలో ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. పుదుచ్చేరిలోని బీచ్‌లు, గాలితో కూడిన తేలికపాటి ఎండ , మంచి వాతావరణం ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది. ఇక ఇక్కడ ఫ్రెంచ్ క్వార్టర్‌లోని పాస్టెల్ వీధులు, బీచ్ సైడ్ కేఫ్స్, విహార ప్రదేశాలు చూసి ఎంజాయ్ చేయవచ్చును.

4 / 5
వయనాడ్, కేరళ : అందమైన ప్రదేశాల్లో కేరళ ముందుంటుంది. ఇక్కడ వాతావరణం, అందమై ప్రదేశాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఇక జనవరిలో చూడాల్సిన ప్రదేశాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది కేరళలోని వయనాడ్, ఈ నెలలో ఇక్కడి అడవి, బోటిగ్ చాలా బాగుంటుంది. ఎడక్కల్ గుహలు, బాణాసుర సాగర్ ఆనకట్ట, వన్య ప్రాణులు అధికంగా ఉండే అభయారణ్యాలు, కాఫీతోటలు మంచి అనుభూతిని ఇస్తాయి.

5 / 5