సాగర్‌లో ఉత్తమ్‌ – కోమటిరెడ్డి కంబైన్డ్ క్యాంపైన్‌.. జానా చలువతోనే కేసీఆర్‌ సీఎం అయ్యారట. ఇదేంటి చెప్మా..!

Uttam and Komatireddy campaign for Jana reddy : తెలంగాణ ప్రజలను దోచుకున్న టీఆర్ఎస్ కు..

  • Venkata Narayana
  • Publish Date - 4:11 pm, Sun, 11 April 21
సాగర్‌లో ఉత్తమ్‌ - కోమటిరెడ్డి కంబైన్డ్ క్యాంపైన్‌..  జానా చలువతోనే కేసీఆర్‌ సీఎం అయ్యారట. ఇదేంటి చెప్మా..!

Uttam and Komatireddy campaign for Jana reddy : తెలంగాణ ప్రజలను దోచుకున్న టీఆర్ఎస్ కు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేతలు పిలుపు నిచ్చారు. అవినీతి సొమ్ముతో నాగార్జున సాగర్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై ప్రవహిస్తోందని పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. గుర్రంపోడు మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ప్రచారం చేశారు. జానారెడ్డి చలవతో కేసీఆర్ సీఎం అయ్యాడని చెప్పారు. జానారెడ్డి హయాంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను విస్మరించి మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై ధరల భారం మోపుతున్న బీజేపీకి పుట్టగతులుండవన్నారు కాంగ్రెస్ నేతలు. రాదని వారన్నారు.

Read also : Visakhapatnam : ఆకాశాన్ని తాకుతోన్న పొగలు.. ఎగసిపడుతోన్న మంటలు, దువ్వాడ సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం