ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? డయాబెటిక్ ఐ కావచ్చు..
26 April 2025
Prudvi Battula
శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించలేకపోవడం వల్ల అది వ్యక్తుల కాళ్ళను ప్రభావితం చేస్తుంది.
మధుమేహం, డయాబెటిస్ లక్షణాలు ఉన్న గర్భిణీలు, గ్లూకోజ్ సమస్య, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు ఉన్నవారిలో డయాబెటిక్ ఐ కనిపిస్తుంది.
అలాగే, సిగరెట్ స్మోకింగ్ చేసేవారిలో, ఊబకాయం సమస్య ఉన్నవారు కూడా డయాబెటిక్ ఐ కి గురయ్యే ప్రమాదం ఉన్నది.
ఇది మన జీవన నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. మధుమేహులు తప్పనిసరిగా రక్తంలో చక్కెరల స్థాయిలను నియంత్రించేలా చూసుకోవడం అవసరం.
డయాబెటిక్ ఉన్నవారిలో సాధారణంగా.. చూపు మసక బారటం, రంగులను గుర్తించడంలో ఇబ్బందిగా మారడం వంటి లక్షణాలు ఉంటాయి.
అలాగే చూపుపై చుక్కలు, తీగలు వేలాడుతున్న అనుభూతి కలగడం, తక్కువ వెలుతురులో చూడటం ఇబ్బందికరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలాంటి సమస్యలు కనిపించగానే వెంటనే కంటి వైద్యుడ్ని సంప్రదించడం ఎంతో ముఖ్యం. లేనట్లయితే కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
గ్రేట్ వాల్ అఫ్ చైనాను కాలినడకన దాటడానికి ఎంత టైమ్ పడుతుంది?
షాజహాన్ నిర్మించిన టాప్ 10 స్మారక చిహ్నాలు..
దేశంలో టాప్ 10 క్లీనెస్ట్ సిటీస్.. 3 ఆంధ్రాలోనే..