గ్రేట్ వాల్ అఫ్ చైనాను కాలినడకన దాటడానికి ఎంత టైమ్ పడుతుంది?

21 April 2025

Prudvi Battula 

పురాతన భవనాల సంస్కృతి, కళలు, చరిత్ర గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్నిఏప్రిల్ 18న జరుపుకుంటారు.

అనేక చారిత్రక భవనాల పేర్లు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. వాటిలో గ్రేట్ వాల్ అఫ్ చైనా కూడా ఒకటి.

గ్రేట్ వాల్ అఫ్ చైనా.. ప్రపంచ ఏడు అద్భుతాలలో ఒకటి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం చైనాలో నిర్మించబడిన గ్రేట్ వాల్ అఫ్ చైనా.

అయితే గ్రేట్ వాల్ అఫ్ చైనా గోడను కాలినడకన దాటడానికి ఎంత సమయం పడుతుంది.? ఈరోజు తెలుసుకుందాం.

ఆగకుండా కాలినడకన గ్రేట్ వాల్ అఫ్ చైనా గోడను దాటితే, మీకు దాదాపు 175 రోజులు పడుతుందని అంటున్నారు నిపుణులు.

అస్సలు ఎక్కడ ఆగకుండా నడిస్తే గ్రేట్ వాల్ అఫ్ చైనా గోడనును దాటడానికి మీకు 4210 గంటలు పట్టవచ్చు అని అంచనా.

గ్రేట్ వాల్ అఫ్ చైనాను క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 16వ శతాబ్దం వరకు నిర్మించారు. మొత్తం పొడవు 21,196 కి.మీ.