AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా

దారులన్నీ ఓరుగల్లు వైపే.. బండెనక బండి కట్టి.. కారెనక కారు పెట్టి.. రజతోత్సవ సభకు కదనోత్సాహంతో కదులుతున్నారు గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. తెలంగాణ అంతా గులాబీ సభపైనే చర్చించుకుంటోంది. ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ సభపైనే మాట్లాడుతున్నాయ్‌. సభకు వంద కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఓరుగల్లు గర్జనకు ముందే విపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయని కారు నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

Telangana: బీఆర్‌ఎస్  రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా
BRS elkathurthy meeting
Ram Naramaneni
|

Updated on: Apr 26, 2025 | 9:41 PM

Share

తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. 25 ఏళ్ల పండగకు ఊరువాడా కదిలింది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటివరకు ఒక లెక్క.. వరంగల్ సభ తర్వాత మరోలెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్లబండ్లు, కార్లు, బస్సులు, కాలినడకన వరంగల్‌కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీ మయంగా మారింది. ఎల్కతుర్తి సభా ప్రాంగణం కొత్త రూపును సంతరించుకుంది. సభకు పది లక్షలమందిని తరలిస్తున్నామంటున్నారు కారు పార్టీ నేతలు. బీఆర్ఎస్‌కు కలిసివచ్చిన వరంగల్‌లో నిర్వహిస్తోన్న రజతోత్సవ సభతో కొత్త చరిత్ర సృష్టిస్తామంటున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ సభపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వరంగల్‌కు బీఆర్ఎస్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ సభకు ఎంత ఖర్చు పెట్టుకుంటామన్నది తమ ఇష్టమంటున్నారు. బీఆర్‌ఎస్‌ సభకు వచ్చేవారు జాగ్రత్తగా రావాలని.. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు హరీష్‌రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..