వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కొత్త పోప్ ఎవరు? వీడియో
క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో కన్నుమూశారు. గత కొంతకాలంగా పోప్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. 88 ఏళ్ల పోప్ చివరిగా ఆదివారం ఈస్టర్ సందేశం ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ కు ప్రపంచం ఘన నివాళి అర్పిస్తోంది. ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తరువాతి పోప్ ఎవరు? పోప్ ఫ్రాన్సిస్ మరణంతో కొత్త పోప్ ఎన్నికకు రేసు ప్రారంభమైంది. ఇటలీకి చెందిన పీటర్ పారోలిన్ రేసులో ముందున్నారు. ఘనాకు చెందిన పీటర్ టర్క్సన్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వీళ్లిద్దరూ కూడా పోప్ ఫ్రాన్సిస్ కు గట్టి మద్దతుదారులు. పోప్ చనిపోయిన నాటి నుంచి కొత్త పోపును ఎన్నుకునేంత వరకు ఉండే సమయాన్ని లాటిన్ భాషలో సెడే వేకెంటే అంటారు.
పీఠం ఖాళీగా ఉందని దీని అర్థం. ఈ సమయంలో కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ వాటికన్ వ్యవహారాలను చూసుకుంటారు. కానీ ముఖ్య నిర్ణయాలు మాత్రం తీసుకోరు. కొత్త పోపును ఎన్నుకునే ప్రక్రియ రెండు మూడు వారాల్లో ప్రారంభమవుతుంది. కొత్త పోప్ ఎన్నిక వ్యవహారం చాలా రహస్యంగా జరుగుతుంది. ఆయనను ఎన్నుకునే సభ్యుల బృందాన్ని కాన్ క్లేవ్ అంటారు. 80 ఏళ్ల లోపు వయసున్న 138 మంది కార్డినల్స్ కు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఈ ఓటింగ్ అనేక దఫాలుగా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కార్డినల్స్ లో 80 శాతం మందిని పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా నిర్మించారు. మొత్తం 138 మంది కార్డినల్స్ ఉన్నారు. ఇందులో భారత్ నుంచి నలుగురున్నారు. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ పూల యాంతోనీ అందులో ఒకరు. కార్డినల్ పూల యాంతోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దళిత వర్గం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయ కార్డినల్ గా రికార్డు సృష్టించారు. పోపుగా ఎన్నికయ్యే వ్యక్తికి మూడింట రెండొంతుల మెజారిటీ రావాలి. ఒకవేళ నిర్ణయం తీసుకునే పక్షంలో వాటికన్ సిక్స్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి నల్లటి పొగ విడుదల చేస్తారు. దాని అర్థం ఓటింగ్ ఇంకా కొనసాగుతోందని. ఒకవేళ పోపును కార్డినల్స్ ఎన్నుకున్నట్లయితే సిక్స్టీన్ చాపెల్ నుంచి తెల్ల పొగ విడుదల చేస్తారు. కొత్తగా ఎన్నుకున్న వ్యక్తిని ఆ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారా అని అడుగుతారు. వారు ఒప్పుకున్నట్లయితే వాటికన్ సెయింట్ పీటర్స్ బెసిలికా బాల్కనీ నుంచి ఆయనను ప్రపంచానికి పరిచయం చేస్తారు. పోపుగా ఆయనకు కొత్త పేరు పెడతారు.
మరిన్ని వీడియోల కోసం :
సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో
వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
