‘చెడుకు గుణపాఠం చెప్పాల్సిందే.. మన బలాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది’: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత , దేశంలో పాకిస్తాన్‌పై ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదానికి సంబంధించి పొరుగు దేశంపై భారతదేశం చర్యలు ప్రారంభించింది. ఈ విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రకటన చేశారు. దారుణాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం అని ఆయన అన్నారు.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత , దేశంలో పాకిస్తాన్‌పై ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదానికి సంబంధించి పొరుగు దేశంపై భారతదేశం చర్యలు ప్రారంభించింది. ఈ విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రకటన చేశారు. దారుణాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం అని ఆయన అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన పుస్కకావిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“రావణుని సంక్షేమం కోసమే చంపారు. దేవుడు అతన్ని చంపాడు. ఇది హింస కాదు, అహింస. అహింస మన మతం కానీ దురాగతాలు చేసేవారికి మతాన్ని బోధించడం అహింస. మనం మన పొరుగువారికి ఎప్పుడూ హాని చేయకూడదు. పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నాం. కానీ, వాళ్లు ఉగ్రదాడులు చేస్తున్నారు. దాడులతో సంబంధం లేదని అబద్దాలు చెబుతున్నారు. ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే, ప్రజలను రక్షించడం రాజు బాధ్యత. రాజు తన పని తాను చేసుకుంటూ పోతాడు” అంటూ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం అని గుర్తుచేస్తోంది. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయరు. ఇది మా స్వభావం కాదు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవు, నష్టాలను నిశ్శబ్దంగా భరించడం కూడా మా సంస్కృతిలో లేదు. మా హృదయాల్లో బాధ ఉంది. మేము కోపంగా ఉన్నాం. చెడును అంతం చేయడానికి మన బలాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది” అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. “రావణుడు తన మనసు మార్చుకోవడానికి నిరాకరించినందున అతన్ని చంపారు. వేరే మార్గం లేదు. రాముడు అతన్ని చంపాడు. కానీ అతనికి సంస్కరించే అవకాశం కూడా ఇచ్చాడు. అతను సంస్కరించనప్పుడు, ఆ తర్వాతే అతన్ని చంపారు” అని ఆయన గుర్తు చేశారు. ఇది ‘ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటం’ గా అభివర్ణించారు. “మేము బలమైన ప్రతిస్పందనను ఆశిస్తున్నాం. నిజంగా అహింసాయుత వ్యక్తి కూడా బలంగా ఉండాలి. బలం లేకపోతే వేరే మార్గం లేదు. కానీ బలం ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అది కనిపించాలి” అని మోహన్ భగవత్ అన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




