26 April 2025
Subhash
నేటి కాలంలో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన పత్రాల్లో ఒకటి. ఆధార్ వల్ల మోసాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం.
మీ ఆధార్ కార్డును ఎవరు..? ఎక్కడ ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. కొన్ని పద్దతుల ద్వారా తెలుసుకునేందుకు అవకాశం ఉంది.
మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉపయోగిస్తున్నారు? దీన్ని తెలుసుకోవడానికి మీరు మీ ఆధార్ కార్డు చరిత్రను తనిఖీ చేయండి.
కొన్ని పద్దతులను ఉపయోగించి మీరు మీ ఆధార్‌ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
ముందుగా మీరు మైఆధార్ అధికారిక పోర్టల్‌కు వెళ్లాలి. అక్కడ మీ ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయాలని గుర్తించుకోండి.
దీని తర్వాత మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. లాగిన్ అయ్యేందుకు ఓటీపీని నమోదు చేయండి.
తర్వాత మీ ప్రామాణీకరణ చరిత్ర ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీరు చరిత్రను చెక్ చేయాలనుకుంటున్న తేదీని ఎంపిక చేయండి.
ఆ తర్వాత మీ స్క్రీన్‌పై ఆధార్ కార్డు ఎక్కడ ఉపయోగించబడుతుందో మీకు కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.