AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వీడియో

అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వీడియో

Samatha J

|

Updated on: Apr 26, 2025 | 1:40 PM

ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆయన నివసించే లగ్జరీ మాన్షన్ ఆంటిలియా. సకల సౌకర్యాలు కలిగిన ఈ భవంతిలో పని దొరికితే చాలు లైఫ్ సెటిల్ అనుకునేవారు ఎందరో. 15 వేల కోట్ల రూపాయల విలువైన ఆంటిలియాలో మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి. ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఈ బిల్డింగ్ లో ఎంత మంది పనిచేస్తారు? అంబానీ వారికిచ్చే జీతం ఎంత? ఆంటిలియాలో పనిమనుషులు, డ్రైవర్స్, చెఫ్స్, గార్డ్ మెన్, బాడీగార్డ్స్ తో కలుపుకొని మొత్తం 600 మంది పనిచేస్తారట. వారందరికీ లక్షల్లో జీతం ఇస్తారట. మల్టీ నేషనల్ కంపెనీలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కన్నా అంబానీ ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చే జీతం ఎక్కువని టాక్. ఆంటిలియాలో అన్ని డిపార్ట్‌మెంట్లలో కలుపుకొని మొత్తం 600 మంది సిబ్బంది పనిచేస్తారట. ఇక అంబానీలకు రుచికరమైన వంటలు చేసి పెట్టే చెఫ్స్ ఒక్కొక్కరి జీతం రెండు లక్షల రూపాయలు పైగానే ఉంటుంది. ఈ లెక్కన ఆంటిలియాలో పనిచేసే వంట మనుషులు ఏడాదికి 24 లక్షల వరకు అందుకుంటారట. ఆ ఇంట్లో పనిచేసే చాలామంది సిబ్బంది దాదాపు ఇంతే మొత్తం జీతం తీసుకుంటారని సమాచారం.

 ముఖేష్ అంబానీకి కార్లంటే మహా ఇష్టం. ఆయన గ్యారేజ్‌లో దాదాపు 168 వివిధ కార్లు ఉన్నాయి. ఆంటిలియాలో కార్ల పార్కింగ్ కోసమే ఆరు అంతస్తులు కేటాయించారు. అంతేకాక ప్రైవేట్ కార్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. పార్కింగ్, సర్వీస్ సెంటర్లో కలుపుకొని పదుల సంఖ్యలో వర్కర్లు పనిచేస్తారట. ఇక అంబానీ కారు నడిపే డ్రైవర్ కు కూడా భారీ వేతనం చెల్లిస్తారని సమాచారం. కాపోరేట్ కంపెనీల్లో పనిచేసే సీనియర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా అంబానీ తన డ్రైవర్లకు జీతాలు ఇస్తారట. జీతానికి అదనంగా ఇన్సూరెన్స్, బోనస్, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయట. అంబానీ పర్సనల్ డ్రైవర్ జీతం 2017లోనే నెలకు రెండు లక్షలుగా ఉండేదట. ఇప్పుడు ఆ శాలరీ మూడు నుంచి నాలుగు లక్షల మధ్య ఉంటుందని అంచనా. ముఖేష్ తన డ్రైవర్లను ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకుంటారట. పర్సనల్ సేఫ్టీ విషయంలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని కమర్షియల్ వాహనాల నుంచి లగ్జరీ కార్ల వరకు అన్నింటినీ నడిపే సామర్థ్యం కలిగిన వారినే డ్రైవర్లుగా ఎంపిక చేసుకుంటారట. ఊహించని పరిస్థితులు ఏర్పడినా వాటిని అధిగమించేలా వారికి ట్రైనింగ్ ఇస్తారని సమాచారం. ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే వారందరూ ఆంటిలియాలోనే ఉంటారు. ఇందుకోసం కొన్ని ఫ్లోర్లు కేటాయించారట. ఇంట్లో పనిచేసే వారికి జీతంతో పాటు అలవెన్సులు, వారి పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు కూడా అంబానీనే చూసుకుంటారని సమాచారం.

మరిన్ని వీడియోల కోసం : 

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్

ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో

వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో