AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ రిమోట్‌లో ఈ బటన్‌ నొక్కితే.. సగం కరెంటు బిల్లే

ఏసీ రిమోట్‌లో ఈ బటన్‌ నొక్కితే.. సగం కరెంటు బిల్లే

Phani CH
|

Updated on: May 15, 2026 | 2:41 PM

Share

వేసవిలో ఏసీ వినియోగం పెరగడంతో కరెంట్ బిల్లులు సామాన్యులను భయపెడుతున్నాయి. అయితే ఏసీ రిమోట్‌లో ఉండే ‘ఎకో’ లేదా ‘ఎనర్జీ సేవింగ్’ మోడ్‌ను ఉపయోగించడం ద్వారా 20 నుంచి 30 శాతం వరకు విద్యుత్ ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 24°C వద్ద ఏసీ ఉంచడం, స్లీప్ మోడ్ వినియోగించడం, ఫిల్టర్లు శుభ్రంగా ఉంచడం వంటి చిన్న జాగ్రత్తలతో భారీగా కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.

మేనెలలో ఎండలు మండిపోతుంటాయి. భానుడి భగభగలకు ఏసీ లేనిదే నిమిషం గడవదు. అయితే ఏసీ ఇచ్చే చల్లదనం ఎంత హాయిగా ఉన్నా, నెలాఖరున వచ్చే కరెంట్ బిల్లు చూస్తే సామాన్యుడికి గుండె ఆగినంత పనవుతోంది. ఈ సమస్యకు మీ ఏసీ రిమోట్‌లోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉందని మీకు తెలుసా? చాలామంది ఏసీ ఆన్ చేయగానే కేవలం ‘కూల్’ బటన్ మాత్రమే వాడుతుంటారు. కానీ రిమోట్‌లోని ‘ఎకో’ లేదా ‘ఎనర్జీ సేవింగ్’ మోడ్‌ను ఆన్ చేస్తే, ఏసీ కంప్రెషర్ తన పనితీరును స్మార్ట్‌గా మార్చుకుంటుంది. ఇది గదిలోని ఉష్ణోగ్రతను బట్టి కంప్రెషర్ వేగాన్ని సర్దుబాటు చేస్తూ, విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల దాదాపు 20 నుండి 30 శాతం వరకు కరెంట్ ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రకారం.. ఏసీని 24°C వద్ద ఉంచడం వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా శరీరానికి కూడా మంచిది. ప్రతి ఒక్క డిగ్రీ పెంచితే 6 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. రాత్రివేళ ‘స్లీప్ మోడ్’ వాడటం వల్ల గంట గంటకు ఉష్ణోగ్రత స్వల్పంగా పెరుగుతూ కరెంటును పొదుపు చేస్తుంది. ఏసీ ఫిల్టర్లలో ధూళి ఉంటే మెషిన్ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. అందుకే ప్రతి 15 రోజులకు ఒకసారి వాటిని క్లీన్ చేయాలి. ఏసీతో పాటు తక్కువ స్పీడ్‌లో సీలింగ్ ఫ్యాన్ వేస్తే చల్లని గాలి గది అంతా త్వరగా వ్యాపిస్తుంది. కేవలం అవగాహన లేకపోవడం వల్లే చాలామంది ఎక్కువ బిల్లులు చెల్లిస్తున్నారు. రిమోట్‌లోని ఈ చిన్న బటన్ వాడి అటు పర్యావరణాన్ని, ఇటు మీ డబ్బును కాపాడుకోండి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పావురంలా అందంగా కనిపించే ఈ పక్షి.. వెరీ డేంజర్‌

కందిపప్పు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే..

అరుదైన ‘నేల మామిడి’ని చూశారా?

బీఎస్ఎన్ఎల్ సరికొత్త చౌక ప్లాన్.. రూ. 225కే అపరిమిత డేటా, కాలింగ్

ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతీ రాత్రి ఉరుములు మెరుపులే

Follow Us