AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పావురంలా అందంగా కనిపించే ఈ పక్షి.. వెరీ డేంజర్‌

పావురంలా అందంగా కనిపించే ఈ పక్షి.. వెరీ డేంజర్‌

Phani CH
|

Updated on: May 15, 2026 | 2:40 PM

Share

చూడటానికి అమాయకంగా కనిపించే ‘నార్తర్న్ ఫుల్మార్’ అనే సముద్ర పక్షి వద్ద శత్రువులను ఎదుర్కొనే భయంకరమైన రక్షణ ఆయుధం ఉంది. దాడికి వచ్చే గద్దలు, డేగలపై ఇది నారింజ రంగు జిగట ద్రవాన్ని చిమ్ముతుంది. ఆ ద్రవం రెక్కలకు అంటుకుని గట్టిపడటంతో శత్రు పక్షులు గాల్లో ఎగరలేక సముద్రంలో పడిపోతాయి. ప్రకృతిలో జీవుల రక్షణ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పక్షి మరోసారి నిరూపిస్తోంది.

చూడటానికి తెల్లగా, ఎంతో సాఫ్ట్‌గా, అమాయకంగా కనిపిస్తుంది. కానీ దీని జోలికి వెళ్తే మాత్రం సాక్షాత్తు డేగలు, గద్దలు కూడా గాలిలోనే ప్రాణాలు వదుల్చుకోవాల్సిందే! ఆకాశంలోని అత్యంత ప్రమాదకరమైన పక్షుల్లో ఒకటిగా పేరుగాంచిన ‘నార్తర్న్ ఫుల్మార్’ గురించి తెలిస్తే షాకవుతారు. సముద్ర తీరాల్లో విహరించే ఈ పక్షిని చూసి సాధారణ పక్షి అని అనుకుంటే పొరపాటే. దీని వద్ద శత్రువులను హతమార్చడానికి ఒక భయంకరమైన ‘రసాయన ఆయుధం’ ఉంది. ఏదైనా పెద్ద పక్షి దీనిపై దాడికి వస్తే, ఇది భయపడి పారిపోకుండా ధైర్యంగా ఎదురునిలుస్తుంది. శత్రువు దగ్గరకు రాగానే, నార్తర్న్ ఫుల్మార్ తన నోటి నుంచి నారింజ రంగులో ఉండే ఒక జిగట ద్రవాన్ని శత్రువు ముఖంపైకి చిమ్ముతుంది. ఈ జిగురు గాలి తగలగానే సిమెంట్‌లా గట్టిగా మారిపోతుంది. ఇది శత్రు పక్షి రెక్కలకు అంటుకోగానే, అవి కదల్లేని స్థితికి చేరుకుంటాయి. ఆయిల్‌లోని రసాయనాల వల్ల రెక్కలు గాలిలో ఆడించడం అసాధ్యంగా మారుతుంది. రెక్కలు మొరాయించడంతో శత్రు పక్షి నియంత్రణ కోల్పోయి నేరుగా సముద్రపు నీటిలో పడిపోతుంది. రెక్కలన్నీ జిగురుతో నిండిపోవడంతో నీటిపై తేలలేక, ఈత కొట్టలేక అది మెల్లగా మునిగి చనిపోతుంది. అంటే, నేరుగా యుద్ధం చేయకుండానే తన దగ్గరున్న ‘కెమికల్ వెపన్’తో గద్దలను సైతం మృత్యువుకు అప్పగిస్తుంది ఈ సైలెంట్ కిల్లర్. ప్రకృతిలో ప్రతి జీవికి తనను తాను కాపాడుకోవడానికి ఎంతటి వింతైన శక్తులు ఉంటాయో చెప్పడానికి ఈ పక్షే ఒక నిదర్శనం!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కందిపప్పు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే..

అరుదైన ‘నేల మామిడి’ని చూశారా?

బీఎస్ఎన్ఎల్ సరికొత్త చౌక ప్లాన్.. రూ. 225కే అపరిమిత డేటా, కాలింగ్

ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతీ రాత్రి ఉరుములు మెరుపులే

బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయాన్నే ఓ గ్లాస్ తాగితే చాలు

Follow Us