AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కందిపప్పు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే..

కందిపప్పు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే..

Phani CH
|

Updated on: May 15, 2026 | 2:15 PM

Share

తెలుగు వంటల్లో ముఖ్యమైన కందిపప్పు అందరికీ మేలు చేయదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, యూరిక్ యాసిడ్, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, ప్రోటీన్ అలెర్జీలు ఉన్నవారు కందిపప్పును పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులోని పొటాషియం, ప్యూరిన్లు, ఆక్సలేట్లు కొన్ని ఆరోగ్య సమస్యలను మరింత పెంచే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా పెసరపప్పు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

తెలుగు వారి భోజనంలో పప్పు ప్రధాన ఐటం. ముద్దపప్పు నుంచి సాంబార్ వరకు కందిపప్పు మన వంటల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ల గనిగా పేరున్న ఈ పప్పు శాఖాహారులకు మేలు చేసినప్పటికీ, కొందరికి మాత్రం ఇది విషంతో సమానమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐదు రకాల సమస్యలు ఉన్నవారు కందిపప్పుకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కందిపప్పును తక్కువగా తీసుకోవాలి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. బలహీనమైన కిడ్నీలు రక్తంలోని అదనపు పొటాషియంను బయటకు పంపలేవు. ఇది రక్తంలో పేరుకుపోవడం వల్ల గుండె లయ తప్పడం, తీవ్రమైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఇందులోని ఆక్సలేట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. కందిపప్పులో ‘ప్యూరిన్లు’ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ విడుదల అవుతుంది. ఈ యాసిడ్ కీళ్ల మధ్య స్ఫటికాలుగా మారి పేరుకుపోవడం వల్ల తీవ్రమైన కీళ్ల నొప్పులు, వాపులు వస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు కందిపప్పు తింటే ఆ సమస్య మరింత పెరుగుతుంది. కందిపప్పులో ఉండే సంక్లిష్ట ప్రోటీన్లను జీర్ణం చేయడానికి మన జీర్ణక్రియ కష్టపడాల్సి ఉంటుంది. దీనివల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట కలుగుతాయి. పేగుల్లో గ్యాస్ పేరుకుపోయి అసౌకర్యంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి కందిపప్పు వల్ల విసర్జన కష్టమై, రక్తస్రావం లేదా వాపు పెరిగే అవకాశం ఉంది. కొందరికి ప్రోటీన్ అలెర్జీ ఉంటుంది. అటువంటి వారు కందిపప్పు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు రావడం, దురద, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆ ప్రోటీన్‌ను తప్పుగా గుర్తించి ప్రతిచర్యలు జరపడం వల్ల ఇలా జరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఉండే కందిపప్పును బరువు తగ్గాలనుకునే వారు పరిమితంగా తీసుకోవాలి. అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. కందిపప్పు పడని వారు లేదా పై సమస్యలు ఉన్నవారు పెసరపప్పును ఎంచుకోవడం ఉత్తమం. ఇది సులభంగా జీర్ణమవుతుంది, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ పెరిగే ముప్పు ఉండదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరుదైన ‘నేల మామిడి’ని చూశారా?

బీఎస్ఎన్ఎల్ సరికొత్త చౌక ప్లాన్.. రూ. 225కే అపరిమిత డేటా, కాలింగ్

ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతీ రాత్రి ఉరుములు మెరుపులే

బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయాన్నే ఓ గ్లాస్ తాగితే చాలు

తెలంగాణాలోని మగవారిలో కొత్త టెన్షన్.. దేశంలో ఇక్కడే ఆ సమస్య ఎక్కువ!

Follow Us