HCA Meeting: హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం.. స్టేజీ మీదే గొడవపడ్డ అజారుద్దీన్, విజయనంద్..

HCA Meeting: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.

HCA Meeting: హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం.. స్టేజీ మీదే గొడవపడ్డ అజారుద్దీన్, విజయనంద్..
Hca Azharuddin
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 11, 2021 | 8:26 PM

HCA Meeting: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) వార్షిక సర్వసభ్య సమావేశంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశం జరుగుతుండగా స్టేజీ మీదే అజారుద్దీన్, విజయానంద్ గొడవపడ్డారు. పూర్తి వివరాల్లోకెళితే.. రెగ్యూలర్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు హెచ్‌సీఏ వార్షి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కాగా, ఈ సమావేశంలో అంబుడ్స్‌మెన్‌గా జస్టీస్ దీపక్ వర్మను నియమించారు. అయితే అంబుడ్స్‌మెన్ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయనంద్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్టేజీ మీదే ఈ ఇద్దరు గొడవ పడ్డారు.

ఈ ఘర్షణ అనంతరం మాట్లాడిన అజారుద్దీన్.. జరిగిన పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. క్రికెట్ అభివృద్ధే తన ధ్యేయం అని స్పష్టం చేశారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం 20శాతం ఫండ్ కేటాయించడం జరిగిందన్నారు. పాండిచేరి, ఆంధ్రప్రదేశ్‌లో లాగా.. తెలంగాణలోని అన్ని జిల్లాలలో గ్రౌండ్‌లని ఏర్పాటు చేస్తామన్నారు.

తాను ప్రెసిడెంట్ అయ్యాక పిఎఫ్, ఐటీ, జీఎస్‌టి, గ్రౌండ్ లీజ్ వంటి సమస్యలను పరిష్కరించానని అజారుద్దీన్ చెప్పుకొచ్చారు. కొంత మంది తమ స్వలాభం కోసం తాను ఏ కార్యక్రమం చేపట్టిన అడ్డుపడాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. హెచ్‌సీఏలో జరుగుతున్న గొడవలపై బీసీసీఐ సీరియస్‌గా ఉందన్నారు. ఏజీఎంలో కావాలనే గొడవకు పాల్పడ్డారని, ఘర్షణకు పాల్పడిన వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు.. అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తామని అజారుద్దీన్ స్పష్టమైన ప్రకటన చేశారు.

Also read:

#AskKTR : ట్విట్టర్‌లో కేటీఆర్‌ ఇప్పుడు రెడీ, మీ సమస్యలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగేయొచ్చు.. కమాన్..!

Sonu sood: మరో అరుదైన గౌరవం అందుకున్న సోనూసూద్.. సొంత రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడార్ గా నియామకం!

Remdesivir : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్‌ ఎగుమతులపై నిషేధం