కారులో కరెన్సీ కట్టలను కాల్చుకున్న చరిత్ర మాది కాదు : టీవీ9 కిచ్చిన ఇంటర్వూలో మంత్రి జగదీష్ రెడ్డి

Jagadish Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు గతమని.. భవిష్యత్తు టీఆర్ఎస్ దేనని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు..

కారులో కరెన్సీ కట్టలను కాల్చుకున్న చరిత్ర మాది కాదు :  టీవీ9 కిచ్చిన ఇంటర్వూలో మంత్రి జగదీష్ రెడ్డి
Venkata Narayana

|

Apr 11, 2021 | 9:30 PM

Jagadish Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు గతమని.. భవిష్యత్తు టీఆర్ఎస్ దేనని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. దేశ ప్రజలు బీజేపీ నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ లో బీజేపీ విడుదల చేసిన చార్జిషీట్, మేనిఫెస్టోను చూసి ప్రజలు నవ్వు కుంటున్నారని మంత్రి అన్నారు. ఎన్నికల సమయంలో కారులో కరెన్సీ కట్టలను కాల్చుకున్న చరిత్ర మాది కాదు అంటూ టీవీ9కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూలో మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, నిన్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సాగర్ లో ప్రచార చేశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చార్జిషీట్‌, మేనిఫెస్టో రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

నాగార్జున సాగర్‌లో అభ్యర్థి ప్రకటనకు ముందు టెంపో మెయింటెన్‌ చేసింది బీజేపీ. టీఆర్‌ఎస్‌ క్యాండేట్‌ ప్రకటన దాకా తన అభ్యర్థెవరో తేల్చకుండా వ్యూహాత్మకంగా ఎదురు చూసింది. చివరికి సామాజిక సమీకరణాలతో లంబాడా అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్‌ రవికుమార్‌ని బరిలోకి దించింది. అప్పటిదాకా టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు కొందరు అలిగినా.. కండువాలు మార్చినా .. లైట్‌ తీసుకుంది కమలం పార్టీ. నామినేషన్‌ వేసినప్పట్నించీ దాదాపు వారం పదిరోజులు.. సాగర్‌లో సింగిల్‌గానే ప్రచారం చేసుకున్నారు బీజేపీ క్యాండేట్‌. స్టార్‌ క్యాంపెయినర్లని ప్రకటించినా ప్రచారానికి ఎవరూ రాలేదు. దీంతో దుబ్బాక ఎన్నికలా సాగర్‌ని బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం లేదన్న చర్చ జరిగింది. అయితే మా వ్యూహం మాకుందంటూ ఎన్నికకు వారం ముందు అమ్ములపొదిలోంచి అస్త్రాలు బయటికి తీసింది బీజేపీ.

బైపోల్‌కి కూడా మ్యానిఫెస్టోని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాగర్ అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టోను హాలియాలో విడుదల చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌పాలనలో సాగర్‌ అభివృద్ధి జరగలేదంటూ… తమ అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పుకొచ్చారు. కేంద్రీయ విద్యాలయంనుంచి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ దాకా సాగర్‌ ప్రజలకు ఎన్నో హామీలిస్తోంది బీజేపీ. మూడు పార్టీల్ని చూశారు…మాకో అవకాశం ఇవ్వండంటూ ప్రజల్లోకెళ్తోంది. సాగర్‌లో బీజేపీ అభ్యర్థి రవికుమార్‌తో కలిసి ప్రచారం చేశారు కిషన్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ల వైఫల్యాలపై ఇప్పటికే చార్జిషీట్‌ వెల్లడిచేసింది కమలం పార్టీ. ఇప్పుడు మేనిఫెస్టోతో ఒక్కసారిగా దూకుడు పెంచింది.

ఇక, సాగర్‌లో అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని జానారెడ్డి ప్రచారం చేస్తుంటే… ఆయన చేసిందేమీ లేదంటూ టీఆర్‌ఎస్‌ జనంలోకెళ్తోంది. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ మోస్ట్ జానారెడ్డి క్రీజ్‌లో ఉంటే… టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తయినా గులాబీపార్టీ టీం అంతా గ్రౌండ్‌లోకి దిగింది. ఈ టైంలో తమకో అవకాశమిస్తే ఏం చేస్తామో మాటలతో కాకుండా.. మేనిఫెస్టో రూపంలో ప్రకటించి కొత్త ఒరవడి సృష్టించింది బీజేపీ. ముఖ్యనేతల్ని రంగంలోకి దించి.. లేటయినా లేటెస్ట్‌గా ప్రచారాన్ని హోరెత్తించాలనుకుంటోంది కేంద్రంలోని అధికారపార్టీ. ఈ నేపథ్యంలో తామేమీ తక్కువ తినలేదన్నట్టు కాంగ్రెస్ , బీజేపీ నేతలపై ఓ రేంజ్‌ లో విరుచుకుపడుతున్నారు గులాబీ నేతలు.

Read also : Mars helicopter flight : అంగారక గ్రహంపై బుల్లి హెలికాప్టర్‌ నేడు ఎగరలేదు, వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎందుకంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu