కాబోయే వాడ్ని కలవడానికి రాత్రి పూట వెళ్లింది… గడ్డి కుప్పలో శవమై తేలింది.. అసలు ఏం జరిగిందంటే..

బీహార్ లోని నలందాలో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భార్యను కలవాలని కోరిన వ్యక్తి.. ఆమె అక్కడకు వెళ్లగానే.. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి..

కాబోయే వాడ్ని కలవడానికి రాత్రి పూట వెళ్లింది... గడ్డి కుప్పలో శవమై తేలింది.. అసలు ఏం జరిగిందంటే..
Women Murder
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Apr 12, 2021 | 9:10 PM

బీహార్ లోని నలందాలో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భార్యను కలవాలని కోరిన వ్యక్తి.. ఆమె అక్కడకు వెళ్లగానే.. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి.. గొంతు కోసి అతికిరాతకంగా హతయమార్చాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని గడ్డికుప్పలో దాచిపెట్టాడు. ఈ ఘటన ద్వారకా బిఘా అనే గ్రామంలో జరిగింది.

తన కుమార్తెతో పెళ్లి ఇష్టం లేకపోవడంతో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు.  నూర్‌పూర్ గ్రామానికి చెందిన  ఆజాద్ కుమార్‌ అనే వ్యక్తితో 19 ఏళ్ల ఖుష్‌బూకు పెళ్లి నిశ్చయించారు పెద్దరు . ఇద్దరికీ జూన్ 20 న వివాహం జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 17 న  ఇరు కుటుంబాల సమక్షంలో పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ అనూహ్యంగా యువతిని, పెళ్లి చేసుకోబోయేవాడు హతమార్చడం సంచలనంగా మారింది.

గడ్డి కుప్పలో అమ్మాయి శవాన్ని కనుగొన్నారు..

యువతి హత్య వార్త తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన కుమార్తె బీహార్ షరీఫ్ నుంచి గ్రాడ్యుయేషన్ చదువతుంది.. నిందితుడు  పాట్నాలో చదువుతున్నాడని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. వివాహం కుదిరిన తరువాత, అతను తన కుమార్తెను కలవాలని.. రాత్రి పూట పిలిచి హత్య చేసినట్లు పేర్కొన్నాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి తమకు సమాచారం అందించినట్లు చెప్పాడు.

అందుకే చంపాడు: మృతురాలి తండ్రి

యువతి హత్య వార్త విన్న వెంటనే ఆమె కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది. తమ కుమార్తె ఎత్తు, అతడి కంటే ఎక్కువని ఫ్రెండ్స్ అన్నారని.. అందుకే అతడు హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: హృదయ విదారకం.. విజయవాడలో తండ్రి, కుమార్తె ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో కన్నీరు పెట్టించే మాటలు

66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో

తిరుమలలోనే అంజనీపుత్రుడు హనుమంతుడు జన్మించాడా? మరి దేశంలోని మిగతా ప్రజల విశ్వాసమేమిటి..?