Viral Video: బాటిల్స్ తో పాలు తాగుతున్న మేకపిల్లలు.. టెయిల్ పవర్ చూడమంటున్న ఆనంద్‌ మహేంద్ర

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహేంద్ర సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు. సామాజిక సృహ ఉన్న వీడియో లను షేర్ చేసి.. నెటిజన్లను ఆలోచింపజేస్తే.. ఒకొక్కసారి సరదా...

Viral Video: బాటిల్స్ తో పాలు తాగుతున్న మేకపిల్లలు.. టెయిల్ పవర్ చూడమంటున్న ఆనంద్‌ మహేంద్ర
Anand Mahindra
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2021 | 3:39 PM

Viral Video:ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహేంద్ర సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు. సామాజిక సృహ ఉన్న వీడియో లను షేర్ చేసి.. నెటిజన్లను ఆలోచింపజేస్తే.. ఒకొక్కసారి సరదా ఉండే ఫన్నీ వీడియో లను కూడా షేర్ చేస్తూ నవ్వు తెప్పిస్తారు.. ఆయన తాజాగా ట్వీట్‌ చేసిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మేక పిల్లలు తోకలు ఊపుతూ పాలు తాగుతున్న వీడియోను ఆయన షేర్‌ చేశారు. షేర్‌ చేసిన వెంటనే ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌ గా మారింది. మేకల సంరక్షకుడు పాల సీసాలను బకెట్‌లో తీసుకొచ్చి వాటి ఒక స్టాండ్‌లో వరుసగా సెట్‌ చేశాడు. బాగా ఆకలిగా ఉన్న ఆ బుజ్జి మేకలు ఆ పాల సీసాలకు బిగించిన పీకల ద్వారా పాలు తాగుతూ.. వాటి పొట్టి తోకలను అటూ.. ఇటూ ఊపుతూ వాటి ఆనందాన్ని వ్యక్తం చేశాయి.

‘ఇది ఒక అందమైన జంతువుల వీడియో మాత్రమే కాదు. ప్రపంచం కొత్త శక్తిని కనుగొన్నట్లు నేను భావిస్తున్నానంటూ టెయిల్‌పవర్ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను జోడించారు. ఊగే తోకలను టర్బైన్‌, ప్రీస్టోకు కలిపితే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.. ’ అని అందులో తెలిపారు. కాగా, ఆనంద్‌ మహేంద్ర పోస్ట్ చేసిన ఈ వీడియో నిమిషాల వ్యవధిలోనే సోషల్‌ మీడియాలో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా లైక్‌లు, షేర్‌లతో హోరెత్తించారు. ‘ఖచ్చితంగా ఈ ‘కొత్త శక్తి’ విద్యుత్ ఉత్పత్తిలో వినూత్న సాంకేతిక పరిజ్ఞానంగా నిలుస్తుంది’ అని కామెంట్లు పెడుతున్నారు.

Also Read: గట్టిగా అంకెలు లెక్కబెడితే.. కరోనా ఉందో లేదో చెప్పేస్తున్న యాప్.. అయితే.. !

ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం.. పిటిషనర్‌కే రూ.50వేలు జరిమానా విధించిన సుప్రీం..