Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం.. పిటిషనర్‌కే రూ.50వేలు జరిమానా విధించిన సుప్రీం..

Supreme Court rejects plea: సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏ మత గ్రంథంలోనూ న్యాయస్థానం జోక్యం

Supreme Court: ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం.. పిటిషనర్‌కే రూ.50వేలు జరిమానా విధించిన సుప్రీం..
Supreme Court
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 12, 2021 | 3:19 PM

Supreme Court rejects plea: సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏ మత గ్రంథంలోనూ న్యాయస్థానం జోక్యం చేసుకోదంటూ తీర్పునిచ్చింది. ఖురాన్ షరీఫ్ నుంచి 26 శ్లోకాలను/ సూరాలను తొలగించాలని లక్నోకు చెందిన వసీం రిజ్వీ దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా.. పిటిషనర్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రకటించింది. ఖురాన్‌లోని 26 శ్లోకాలను తొలగించాలని యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచార‌ణ‌ చేపట్టింది.

ఖురాన్‌లోని ఈ శ్లోకాలను బోధించడం ద్వారా చాలామంది మత ప్రముఖులు విద్యార్థులను తప్పుదారి పట్టించారని.. ఉగ్రవాదం పెరుగుతోందని వాటిని తొలగించాలంటూ పిటిషన‌ర్ కోరారు. పిటిష‌న‌ర్ వాద‌న‌ల‌ను విన్న సుప్రీంకోర్టు ఈ పిటషన్‌ను తిరస్కరించింది. ఏ మ‌త గ్రంథంలోనూ జోక్యం చేసుకోమ‌ని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతోపాటు రూ.50వేల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పును ప్రకటించిన న్యాయమూర్తుల్లో జస్టిస్ రోహింటన్ ఎఫ్ నరిమాన్‌తోపాటు బీఆర్ గవై, హృషికేశ్ రాయ్ కూడా ఉన్నారు. అయితే పిటీషన్ పూర్తిగా నిరాధారమైనదని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

ఇదిలాఉంటే.. వసీం రజ్వీ ఖురాన్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గత నెలలో నేషనల్ మైనారిటీ కమిషన్ (ఎన్‌సిఎం) కూడా నోటీసు జారీ చేసింది. దీనిపై పూర్తిగా వివరణ ఇవ్వాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మైనారిటీ కమిషన్ పోరాడుతుందని పేర్కొంది. రజ్వీ విచారణ ఏదర్కొనేందుకు సిద్దంగా ఉండాలంటూ పేర్కొంది. రిజ్వి చేసిన వ్యాఖ్యలు దేశ మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కనిపిస్తున్నాయని పేర్కొంది.

Also Read:

Earthquake: ఇండోనేషియాను కుదిపేస్తున్న వరుస భూకంపాలు.. 8 మంది మృతి.. భారీగా నష్టం

Space Wastage: అంతరిక్షంలో అంతకంతకూ పెరుగుతున్న చెత్తా చెదారం.. ఫ్యూచర్‌లో జరిగేది ఇదే!