Four IPS Officers In A Family: తండ్రి ఇన్స్పిరేషన్‌తో మొదటి ప్రయత్నంలో ఐపీఎస్‌కు సెలక్ట్ అయిన తెలుగింటి ఆడపడుచు

Four IPS Officers In A Family: సర్వసాధారణంగా ఆడపిల్లలకు తండ్రి అంటే మక్కువ ఎక్కువ. ఆడపిల్లలను తండ్రి ఎంతో అపురూపంగా తనకు మరో అమ్మగా భావించి ప్రేమగా...

Four IPS Officers In A Family: తండ్రి ఇన్స్పిరేషన్‌తో మొదటి ప్రయత్నంలో ఐపీఎస్‌కు సెలక్ట్ అయిన తెలుగింటి ఆడపడుచు
Deepika Ips
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2021 | 6:54 PM

Four IPS Officers In A Family: సర్వసాధారణంగా ఆడపిల్లలకు తండ్రి అంటే ఎక్కువ అలవాటు.. ఆడపిల్లలు తండ్రి ఎంతో అపురూపంగా తనకు మరో అమ్మగా భావించి ప్రేమగా చూసుకుంటాడు.. ఇక తండ్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆడపిల్లలు అదే దారిలో వెళ్లి సక్సెస్ అయినవారు ఎందరో.. అలా ఓ ఐపీఎస్ తండ్రిని చూసి.. పోలీస్ వృత్తి అంటే ఇష్టపడి.. తాను ఎంతో కష్టపడి చదువుకుని మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ గా ఎంపికయ్యారు.. ప్రస్తుతం ఏఎస్పీ సేవలను అందిస్తున్నారు.. ఆమె ఎంతో మంది మహిళలకు ప్రేరణ ఈ తెలుగింటి ఆడబడుచు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఆమె దీపికా ఎం పాటిల్..ప్రస్తుతం పార్వతి పురం ఏఎస్పీగా కొత్త బాధ్యతలు చేపట్టిన దీపికా ఎం పాటిల్‌ ‌. ఆంధ్రాలో పుట్టి ఝార్ఖండ్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబం. స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా ఆమదాలలంక. తాతగారిది వ్యవసాయ కుటుంబం.. అయితే దీపిక తండ్రి మండవ విష్ణు వర్ధన్‌ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్స్ తో చదుకుని ఐపీఎస్ గా ఎంపికయ్యారు. వృత్తి రీత్యా విష్ణువర్ధన్ ఝార్ఖండ్‌లో స్థిరపడటంతో అక్కడే దీపిక బాల్యం విద్యాభాస్యం సాగాయి. తండ్రి వృత్తిరీత్యా బదిలీల నేపథ్యంలో దీపిక చదువు కూడా వివిధ ప్రాంతాల్లో సాగింది. ఇక బిట్స్ పిలానీ పట్టాను రాజస్థాన్‌ లో పుచ్చుకున్నారు.

అయితే దీపక తల్లి కూడా విద్యావంతురాలు దీంతో కూతుర్ని చదువు తో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించారు. తల్లిదండ్రుల పోత్సాహంతో తాను కూడా తండ్రిలా పోలీస్ ఆఫీసర్ కావాలని భావించారు దీపిక. వారి ప్రోత్సాహంతో 2013 లో సివిల్స్ రాసింది. మొదటి ప్రయత్నంలో సక్సెస్ అందుకున్నారు. 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. గ్రేహౌండ్స్‌ కమాండర్‌గా మొదటి సారిగా పనిచేసే అవకాశం లభించింది. అయితే తనకు తండ్రి తోపాటు.. అన్నయ్య, భర్తలు ఐపీఎస్ కు కావడంతో.. వారు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో దగ్గర నుంచి చూడడంతో ఇప్పుడు పెద్దగా వృత్తిలో ఏ విధమైన ఇబ్బందులు లేవని చెప్పారు దీపిక.

అయితే తండ్రి జన్మించిన ఆంధ్రప్రదేశ్ లో తాను ఉద్యోగిగా విధులు నిర్వహిచడం తనకు ఎంతో సంతోషంగా ఉందని.. ఆయన కోరిక తన ద్వారా తీరిందని చెప్పారు దీపిక. ఇక దీపిక భర్త కూడా ఐపీఎస్ కేడర్ కు చెందిన అధికారి. పేరు విక్రాంత్ పాటిల్. దీపిక: అన్నయ్య హర్షవర్ధన్, విక్రాంత్‌ పాటిల్‌ మంచి స్నేహితులు. తరచుగా వీరిద్దరూ కలవడానికి ఇంటికి రావడంతో పరిచయం ఏర్పడి.. ఆది ప్రేమగా మారింది. దీపక.. విక్రాంత్ పాటిల్ లు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. దీంతో దీపిక మండవ ఇప్పుడు దీపక ఎం. పాటిల్ గా స్థిరపడ్డారు. యువత తలుచుకుంటే సాధించలేదని ఏదీ లేదని.. తప్పటడుగులు వేయకుండా జీవితాన్ని క్రమశిక్షణతో తీర్చి దిద్దుకోవాలని చెప్పారు. దేశం నాకు ఏమి ఇచ్చింది అని కాకుండా మనం ఈ దేశ పౌరులుగా ఏమి చేశామని ఆలోచించాలన్నరు దీపిక.

Also Read: పంచాంగంలో చెప్పినట్లు తెలంగాణలో సాగునీరు సంవృద్ధిగా లభిస్తుందంటూ ఉగాది శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్

దేశంలో అరుదైన హనుమాన్ ఆలయం.. ఆయన్ని పెళ్లికాని వారు పూజిస్తే.. వెంటనే పెళ్లి..!