ఈ ఉగాదికి రుచికరమైన వంటలు.. సులభంగా… టెస్టీగా.. ఎక్కువ శ్రమ లేకుండా చేసేయ్యండిలా..
Ugadi 2021 Recipes: ఉగాది పండుగ అంటే నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం. ఈ రోజున కేవలం షడ్రుచుల పచ్చడి మాత్రమే కాకుండా.. మరిన్ని రుచికరమైన వంటకాలను
Ugadi 2021: ఉగాది పండుగ అంటే నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం. ఈ రోజున కేవలం షడ్రుచుల పచ్చడి మాత్రమే కాకుండా.. మరిన్ని రుచికరమైన వంటకాలను కూడా ట్రై చేయవచ్చు. ఇందుకోసం కొన్ని సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేసుకోండి. మరీ అవెంటె తెలుసా.
మామిడికాయ చిత్రాన్నం..
కావల్సిన పదార్థాలు…
ఉడకబెట్టిన బియ్యం.. 1 కప్పు తురుమిన ముడి మామిడకాయ – ఒకటి పచ్చిమిర్చి.. 10 పసుపు.. చిటికెడు వేరు సెనగలు.. 1/2 కప్పు.. కొత్తిమిర .. కట్ట తురిమిన కొబ్బరికాయ .. కప్పు ఎండబెట్టిన మెంతి ఆకు.. ఒక టీస్పూన్ ఉప్పు తగినంత
తయారీ విధానం..
ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో పచ్చి మిర్చి, ఇంగువ, పసుపు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మరో బాణాలిలో నూనే వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, వేరుశనగ పప్పును వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించాలి. ఇందులో మిక్సీ జార్‌లో వేసుకున్న పేస్ట్ వేసి, ఆపై కొద్దిగా కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర, మేథి పౌడర్ వేసి, అందులో ఉడికించిన అన్నం, తురిమిన పచ్చి మామిడి తురుమును వేసి బాగా కలపండి. మామిడికాయ పుల్లగా ఉంటే, అందులో ఒక టీస్పూన్ చక్కెరను కూడా కలపొచ్చు. ఇందులో తురిమిన కొబ్బరి, ఉప్పు వేసి అన్ని పదార్థాలను బాగా వేయించాలి.
సెనగపప్పు చారు.. కావాల్సిన పదార్థాలు..
సెనగపప్పు – అరకప్పు సెనగపప్పును ఉడికించిన నీళ్లు.. ఉప్పు.. తగినంత చింతపండు.. కొద్దిగా.. కారం.. చెంచా. ధనియాల పొడి.. చెంచా పసుపు… చెంచా.. ఇంగువ చిటికెడు.. పచ్చిమిర్చి.. రెండు. ఉల్లిపాయ.. ఒకటి. కొబ్బరి తురుము.. రెండు చెంచాలు.. నీళ్లు..తగినన్ని.. తాలింపు కోసం.. నూనె.. చెంచా ఆవాలు.. అరచెంచా జీలకర్ర.. అరచెంచా.. కరివేపాకు.. కొద్దిగా
తయారీ విధానం…
చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సెనగపప్పుని ఉడికించుకొని నీటిని తీసి పక్కనపెట్టుకోవాలి. కప్పు సెనగప్పు నీళ్ళలో కప్పులో మూడోవంతు సెనగప్పు కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, ధనియాల కారం, ఇంగువ వేసి మరిగించుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా నూనే వేసి ఇందులో తాలింపు సరుకులు వేసుకొని అందులో ముందుగా మిగుల్చుకున్న రసం వేయాలి. ఒక్క మరుగు వచ్చిన తర్వాత కొత్తిమీర, కొబ్బరి పొడి వేసి దించాలి. అంతే.
కొబ్బరి లడ్డులు.. కావాల్సినవి..
మిల్క్ మెయిడ్ లేదా కండెన్స్డ్ పాలు… కప్పు కొబ్బరి కోరు.. రెండు కప్పులు సన్నగా తరిగిన ఎండు పప్పులు (బాదం, జీడిపప్పు, కిస్ మిస్).. మూడు చెంచాలు. ఇలాచి పొడి.. చెంచా.
తయారి విధానం..
ముందుగా నాన్ స్టిక్ పాన్‌లో కొబ్బరి కోరుని రెండు నిమిషాలు పాటు వేయించుకోవాలి. ఇందులోనే కండెన్స్డ్ పాలు, ఎండు పప్పులు, ఇలాచి పొడి వేసి బాగా కలిపి దగ్గరకు రానివ్వాలి. ఒక పళ్లెంలోకి తీసుకుని చల్లారిన తర్వాత లడ్డుల్లాగా చుట్టుకోవాలి.
Also Read: మీ పిల్లలు చెక్కర తింటున్నారా ? వారి మెదడుపై ఈ ప్రభావం ఉంటుందట.. అధ్యాయనాల్లో షాకింగ్ విషయాలు..
షుగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..