AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi Special Purnam Boorelu: ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు రుచిగా పర్ఫెక్ట్ గా చేసుకోండిలా …

ఉగాది పర్వదినాన ప్రత్యేకమైన ఉగాది పచ్చడి తో పాటు. సంప్రదాయ వంటలైన పులిహోర, బొబ్బట్లు, పూర్ణాలు.. కొంతమంది వీటిని పూర్ణం బూరెలు అని కూడా అంటారు.. తప్పనిసరిగా...

Ugadi Special Purnam Boorelu:  ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు రుచిగా పర్ఫెక్ట్ గా చేసుకోండిలా ...
Purnam Burelu
Surya Kala
|

Updated on: Apr 13, 2021 | 11:09 AM

Share

Ugadi Special Purnam Boorelu: కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం రోజున ఉగాది పండగగా జరుపుకుంటారు. తెలుగువారి లోగిళ్ళు పచ్చని తోరణాలతో కళకళలాడుతాయి. ఇక ఉగాది పర్వదినాన ప్రత్యేకమైన ఉగాది పచ్చడి తో పాటు. సంప్రదాయ వంటలైన పులిహోర, బొబ్బట్లు, పూర్ణాలు.. కొంతమంది వీటిని పూర్ణం బూరెలు అని కూడా అంటారు.. తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈరోజు ఉగాది స్పెషల్ గా పూర్ణం బూరెల తయారీ విధానాన్ని తెలుసుకుందాం.. వీటిని తయారు చేయడం కొంచెం శ్రమతో కూడుకున్నదే.. అయితే ఏమిటి.. వండిన తర్వాత.. పూర్ణం బూరెల్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే.. ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటారు మరి.. ఈరోజు ఉగాది స్పెషల్ గా ఆంధ్ర స్టైల్ లో పూర్ణాలు తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం..!

పూర్ణంబూరెల తయారీకి కావలసిన పదార్ధాలు:

ఒకకప్పు – మినపపప్పు రెండుకప్పులు – బియ్యం రెండుకప్పులు- శనగపప్పు అరకప్పు-ఎండుకొబ్బరిపొడి కప్పున్నర- బెల్లం నెయ్యి రెండు చెంచాలు యాలుకలపొడి నూనె వేయించడానికి సరిపడా…

తయారీ విధానం:

ముందుగా మినపపప్పు, బియ్యం నానబెట్టాలి. మినపపప్పు నానిన తర్వాత చిటికెడు ఉప్పు వేసి దోసెలపిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. ఓగిన్నెలో శనగపప్పుముని గేంతవరకూ నీరుపోసుకుని ఉడికించాలి. పప్పుకేవలం ఉడకాలి, చెదిరిపోకూడదు. ఇలా పలుకుగా ఉడికించి వేడిమీదనే వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలో కొద్ది కొద్దిగా వేసి మెత్తగా ముద్దలాచేయాలి. ఓబాండీలో నెయ్యి మొత్తంవేసి కొబ్బరి కోరుని కమ్మని వాసన వచ్చేలా వేపాలి. శనగపప్పు ముద్దలో బెల్లంతురుము, వేపిన కొబ్బరి, యాలుకలపొడి వేసి బాగా కలిపి గుండ్రని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. వీటినే పూర్ణం అంటారు. తర్వాత మూకుడలో నూనెపోసి, ఈముద్దలు ఒక్కోటీ దోసెలపిండిలోముంచి కాగిననూనెలో మంచిరంగు వచ్చేలా వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగాఉండే పూర్ణం బూరెలు సిద్దం.  బూరెకి రంధ్రంచేసి కమ్మని నేతిని అందులో వేసుకుని ఆస్వాదించండి.

Also Read: కరోనా నిబంధనల మధ్య ప్రారంభమైన వైష్ణవిదేవి అమ్మవారి శార్దియా నవరాత్రి వేడుకలు  

కరోనా బారిన పడిన నిర్మాత దిల్ రాజు.. టెన్షన్ లో మెగాస్టార్ ‘అభిమానులు’