Dil Raju Corona Positive: కరోనా బారిన పడిన నిర్మాత దిల్ రాజు.. టెన్షన్ లో మెగాస్టార్ ‘అభిమానులు’

Dil Raju Corona Positive: సామాన్య ప్రజలతో పాటు. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు కూడా కరోనా బాధితులుగా మారిపోయారు. సినీ పరిశ్రమలో వరసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకీ ప్రముఖులు..

  • Surya Kala
  • Publish Date - 9:21 am, Tue, 13 April 21
Dil Raju Corona Positive: కరోనా బారిన పడిన నిర్మాత దిల్ రాజు.. టెన్షన్ లో మెగాస్టార్ 'అభిమానులు'
Dil Raju Chiru

Dil Raju Corona Positive: సామాన్య ప్రజలతో పాటు. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు కూడా కరోనా బాధితులుగా మారిపోయారు. సినీ పరిశ్రమలో వరసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకీ ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ కోసం గత కొన్ని రోజులుగా దిల్ రాజు ఎక్కువగా బయట తిరిగారు. ప్రమోషన్స్ కార్యక్రమాలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ తో కూడా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అయన హోమ్ ఐసోలేషన్ కు వెళ్లారు.

అంతేకాదు.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. అయితే దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మూవీ చేయడం అనే కలను నెరవేర్చుకున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక వకీల్ సాబ్ చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ మూవీ ప్రమోషన్ సమయంలో దిల్ రాజుతో నే ఎక్కువ సమయం గడిపాడు ఈ నేపథ్యంలో ఆయన కూడా హోమ్ ఐసోలేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే దిల్ రాజుకు కరోనా పాజిటివ్ అని తెలియగానే మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే వకీల్ సాబ్ సక్సెస్ సందర్భంగా చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు, వేణు శ్రీరామ్ ను మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితం సన్మానించారు. దీంతో ఇప్పడు మెగా ఫ్యామిలీ కంగారు పడుతున్నారు. గతం లో కూడా చిరంజీవి కరోనా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చి. అవి తప్పుడు రిపోర్ట్స్ అని తెలిసిన సంగతి విదితమే.. కాగా వకీల్ సాబ్ చిత్ర యూనిట్ లో హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా పాజిటివ్ గా వచ్చి.. ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. దీంతో నివేదా సినిమా నటీనటులతో కలిసి సందడి చేసింది.
ఇప్పుడు దిల్ రాజుకు పాజిటివ్ రావడంతో వెంటనే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఉద్యోగులతో పాటు .. దిల్ రాజుని గత కొన్ని రోజులుగా కలిసిన వారు అంతా అప్రమయ్యారు.

Also Read: బ్యాట్ వదిలి గరిట పెట్టిన ఐపీఎల్ క్రికెటర్స్… టీమ్ సభ్యుల కోసం పసందైన వంటలతో అలరించిన వైనం

ఆయనకి ఏమీ కాను.. అందుకనే మందులు వేసుకోనన్న దీప.. పంతం కంటే ప్రాణం ముఖ్యమని ఆలోచిస్తున్న కార్తీక్