Rashmika Mandanna : ఈ లక్కీ బ్యూటీ టాలీవుడ్‌‌‌‌‌ను నై అని బాలీవుడ్‌‌‌‌కు సై అంటుందా..?

టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో అందాల భామ రష్మిక మందన ఒకరు. ఈ అమ్మడు  శౌర్య నటించిన ఛలో సినిమాతో  తెలుగుప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ ను సొంతం చేసుకు కోవడంతో పాటు అమ్మడి

  • Rajeev Rayala
  • Publish Date - 4:01 pm, Tue, 13 April 21
Rashmika Mandanna : ఈ లక్కీ బ్యూటీ టాలీవుడ్‌‌‌‌‌ను నై అని బాలీవుడ్‌‌‌‌కు సై అంటుందా..?
Rashmika

Rashmika Mandanna : టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో అందాల భామ రష్మిక మందన ఒకరు. ఈ అమ్మడు  శౌర్య నటించిన ఛలో సినిమాతో  తెలుగుప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ ను సొంతం చేసుకు కోవడంతో పాటు అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది. ఈ సినిమాకూడా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ కన్నడ భామకు తెలుగులో అవకాశాలు క్యూకట్టాయి. ఆతర్వాత ఏకంగాసూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ దక్కించుకుంది రష్మిక.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ తో జత కట్టింది ఈ క్యూట్ బ్యూటీ. అందం అభినయంతో కుర్రాళ్ళమనసు దోచేసింది రష్మిక. ఇప్పటివరకు కన్నడ తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.  ఇప్పుడు బాలీవుడ్ లోను సత్తా చాటడానికి సిద్దమవుతుంది. హిందీ జెర్సీ ఆఫర్ వదులుకున్న రష్మిక వెంట వెంటనే సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను.. అలాగే అమితాబ్ తో గుడ్ బాయ్ సినిమాలకు సంతకాలు చేసింది. మరో వైపు తమిళ్ లో కూడా సినిమాలను చేస్తుంది. ఇటీవలే కార్తి హీరోగా నటించిన సుల్తాన్ సినిమాతో అక్కడ అడుగు పెట్టింది రష్మిక. అయితే తాజాగా ఈ అమ్మడిపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే. రష్మిక టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పేయబోతోందని తాజాగా ప్రచారం సాగిపోతోంది. రష్మిక బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు ఒకే చెప్పడమే ఈ రూమర్ కు కారణం అయ్యి ఉంటుంది. ఎందుకంటే ముందుగా ఈ అమ్మడు కన్నడ లో సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తడంతో అక్కడ సినిమాలను తగ్గించి ఇక్కడ సినిమాలను పెంచింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు వెతుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో రష్మిక టాలీవుడ్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : Khiladi​​ Movie Teaser: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న మాస్ రాజా.. ఖిలాడి టీజర్‌‌‌‌తో కుమ్మేస్తున్న రవితేజ

Jwala Gutta-Vishnu Vishal: పెళ్లిపీటలెక్కనున్న బ్యాట్మెంటన్ స్టార్.. వెడ్డింగ్ డేట్ చెప్పేసిన గుత్తా జ్వాలా

Viraata Parvam : గుమ్మానికి పసుపు రాస్తున్న అమ్మాడి.. ‘విరాటపర్వం’ నుంచి పోస్టర్ రిలీజ్