Chennai Super Kings: బ్యాట్ వదిలి గరిట పట్టిన ఐపీఎల్ క్రికెటర్స్… టీమ్ సభ్యుల కోసం పసందైన వంటలతో అలరించిన వైనం
Chennai Super Kings: క్రికెట్ బ్యాట్ పట్టి. పరుగుల వర్షం కురిపించి అభిమానులను అలరించే క్రికెటర్స్.. కాసేపు బ్యాట్ ను పక్కన పెట్టి.. గరిట పట్టారు.. వంట మాస్టర్లుగా మారారు. ఇది ఐపీఎల్ 14వ సీజన్ లో..
Chennai Super Kings: క్రికెట్ బ్యాట్ పట్టి. పరుగుల వర్షం కురిపించి అభిమానులను అలరించే క్రికెటర్స్.. కాసేపు బ్యాట్ ను పక్కన పెట్టి.. గరిట పట్టారు.. వంట మాస్టర్లుగా మారారు. ఇది ఐపీఎల్ 14వ సీజన్ లో చోటు చేసుకుంది. మరి ఎవరా చెఫ్ లు అనుకుంటున్నారా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు అంబటి రాయుడు, సురేష్ రైనాలు వంట మాస్టర్ల అవతారం ఎత్తారు. ఇద్దరూ కిచెన్ లో గరిటెలు తిప్పి.. పసందైన వంటలతో సందడి చేశారు. గుమగుమలాడే బిర్యానీని వండి తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చైన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 14వ సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. సంగతి తెలిసిందే. ఈ తొలి మ్యాచ్ తర్వాత విరామం జట్టు సభ్యులకు విరామం లభించింది. దీంతో ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్‌లో సరదాగా గడిపారు.
ఇక స్టార్ బ్యాట్స్‌మెన్లు సురేశ్ రైనా, అంబటి రాయుడు జట్టు సభ్యుల కోసం కమ్మని పసందైన వంటకాలు సిద్ధం చేశారు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు హైదరాబాదీ బిర్యానీ ని తయారు చేయడంలో స్పెషలిస్ట్.. దీంతో హోటల్ లో కిచెన్ లో ఎంటర్ అయిన రాయుడు బిర్యానీని రెడీ చేశాడు. రాయుడుకి రైనా వంటలో సాయం చేశాడు. ఇద్దరూ కలిసి రుచికరమైన బిర్యానీ తయారు చేశారు. తర్వాత టీమ్ అందరూ కలిసి.. బిర్యానీని తిన్నారు. తర్వాత రుచికరమైన బిర్యానీని తయారు చేసిన ఇద్దరిపై ఇతర టీమ్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. చైన్నై టీమ్ చేసిన సందడిని వీడియోను చెన్నై ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Food, fun and friends! EP 4️⃣ – Anbuden Diaries serves all of the pride’s tasty feasts that were cooked with a sprinkle of #Yellove #WhistlePodu ?? @SPFleming7 @quality_nz pic.twitter.com/gLBzlThTO1
— Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2021
View this post on Instagram
Also Read: ఆయనకి ఏమీ కాను.. అందుకనే మందులు వేసుకోనన్న దీప.. పంతం కంటే ప్రాణం ముఖ్యమని ఆలోచిస్తున్న కార్తీక్
బ్యాంక్ కస్టమర్స్ బీ ఎలర్ట్.. ఈ వారంలో ఎన్ని సెలవులు వచ్చాయంటే..!