IPL 2021: అంపైర్ వార్నింగ్‌తో బౌలింగ్ ఛేంజ్..! ఆఫ్ స్పిన్ వదిలేసి ఇదేం బౌలింగ్ బాసు..?
Umpire Warns Riyan Parag : ఇటీవల చాలా బౌలర్లు రౌండ్ ఆర్మ్ బౌలింగ్ ప్రయోగం చేస్తున్నారని వినబడుతున్న మాట. ఇది ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా మొదలైంది. బ్యాట్స్‌మెన్‌ను కన్‌ఫ్యూజ్ చేయడానికి బౌలర్
Umpire Warns Riyan Parag : ఇటీవల చాలా బౌలర్లు రౌండ్ ఆర్మ్ బౌలింగ్ ప్రయోగం చేస్తున్నారని వినబడుతున్న మాట. ఇది ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా మొదలైంది. బ్యాట్స్‌మెన్‌ను కన్‌ఫ్యూజ్ చేయడానికి బౌలర్ వేసే ఒక ఎత్తుగడ అన్నమాట. రవిచంద్రన్ అశ్విన్, కేదార్ జాదవ్‌లు కూడా ఈ తరహా బౌలింగ్ వేసిన జాబితాలో ఉన్న ప్రముఖ క్రికెటర్లు.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వేసి విమర్శలు పాలయ్యాడు. ఈ తరహా బౌలింగ్‌ను గమనించిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. అశ్విన్ బౌలింగ్ శైలిని తప్పుబట్టాడు. తాజాగా రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రియాన్ పరాగ్ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఐపీఎల్‌లో భాగంగా నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రియాన్ పరాగ్ రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వేయబోయాడు. అప్పటికి గేల్ బ్యాటింగ్‌లో ఉన్నాడు. 10 ఓవర్ మూడో బంతిని రౌండ్ ఆర్మ్ బంతిగా వేశాడు. ఆ క్రమంలో అతని మోచేతి గ్రౌండ్‌కు దాదాపు సమాంతరంగా ఉండటంతో అంపైర్ రంగంలోకి దిగాడు. ఆ బంతిని ఉద్దేశిస్తూ.. జాగ్రత్త.. అంతలా రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వేస్తే నిబంధనలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో వెంటనే పరాగ్ బౌలింగ్ యాక్షన్ మార్చేశాడు. తన మునపటి స్టైల్ బౌలింగ్ వేశాడు. అయినప్పటికీ క్రిస్ గేల్ వికెట్‌ను సాధించాడు.
కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా మ్యాచ్ కొనసాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 200కు పైగా పరుగులతో భారీ స్కోర్ నెలకొల్పినా రాజస్థాన్ చివరి బతి వరకు పోరాడింది. ప్రధానంగా ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ (119: 63 బంతుల్లో.. 12 ఫోర్లు, 7 సిక్సులు) ఒంటరి పోరాటం చేసిన తీరు అభిమానులను కట్టిపడేసింది. శాంసన్ సెంచరీతో అదరగొట్టినా మిగతా బ్యాట్స్‌మన్ రాణించకపోవడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
Talk about a low tactic – The almost underarm – I like this from Riyan Parag. #bowlersfightback #IPL2021 pic.twitter.com/KzNMyDXoVf
— simon hughes (@theanalyst) April 12, 2021