20 బంతుల్లో 50 పరుగులు..! ఒకే ఫోర్.. మిగతావి మొత్తం సిక్స్‌లే.. ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడు..

Deepak Hooda Fifty : ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా సంచలనం సృష్టించాడు. పంజాబ్ తరఫున ఆడిన బ్యాట్స్‌మన్ 28 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

20 బంతుల్లో 50 పరుగులు..!  ఒకే ఫోర్.. మిగతావి మొత్తం సిక్స్‌లే.. ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడు..
Deepak Hooda
Follow us
uppula Raju

|

Updated on: Apr 13, 2021 | 8:33 AM

Deepak Hooda Fifty : ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా సంచలనం సృష్టించాడు. పంజాబ్ తరఫున ఆడిన బ్యాట్స్‌మన్ 28 బంతుల్లో 64 పరుగులు చేశాడు. తన ఈ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. కొన్ని నెలల క్రితం సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడుతున్నప్పుడు కెప్టెన్ క్రునాల్ పాండ్యాతో గొడవకు దిగాడు. అప్పుడు అతన్ని సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఐపిఎల్ 2021 లో తన తొలి మ్యాచ్‌లో ఈ ఆటగాడు చెడు జ్ఞాపకాలను వదిలి గొప్ప బ్యాటింగ్ చేశాడు. అతను బ్యాటింగ్ కోసం నాలుగో స్థానంలో నిలిచాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్‌తోసెంచరీ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ సమయంలో దీపక్ హుడా 20 బంతుల్లో యాభై పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఏకైక ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. ఆ సమయంలో పంజాబ్ స్కోరు 9.5 ఓవర్లలో రెండు వికెట్లకు 89. కానీ హుడా రాకతో పరుగుల వేగం పెరిగింది. అతను రాజస్థాన్ ప్రతి బౌలర్‌ని ఊచకోత కోశాడు. ఫోర్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన అతడు ఆ తర్వాత శివం దుబే ఓవర్‌లో రెండు సిక్సర్లు, శ్రేయాస్ గోపాల్ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదడంతో 15 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. అనంతరం అదే వేగంతో 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏప్రిల్ 12 న ఐపీఎల్‌లో రెండోసారి అర్ధ సెంచరీ సాధించాడు. అంతకుముందు ఐపిఎల్ 2015లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నప్పుడు అతను ఏప్రిల్ 12, 2015 న 22 బంతుల్లో అర్ద సెంచరీ కొట్టాడు.

దీపక్ హుడా 50 పరుగులలో ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువగా ఉన్నాయి. ఒక ఫోర్, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఫిఫ్టీ తర్వాత కూడా హుడా ఆగలేదు. చేతన్ సకారియా ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. 18 వ ఓవర్లో క్రిస్ మారిస్ నుంచి పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అతను ర్యాన్ పరాగ్ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. 28 బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో 105 పరుగుల భాగస్వామ్యం చేశాడు. వారు 10 వ ఓవర్లో క్రీజుకు వచ్చినప్పుడు జట్టు స్కోరు 89 అయితే ఏడు ఓవర్ల తరువాత వారు 18 వ ఓవర్లో అవుట్ అయినప్పుడు పంజాబ్ జట్టు 194 పరుగులకు చేరుకుంది.

FD Frauds: ఇలా చేశారంటే మీ ఖాతాలో డబ్బులన్నీ మాయం.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న ఎస్‌బీఐ

క్రికెట్‌ ఆడేందుకు బూట్లు కూడా లేవు ఒకప్పుడు..! ప్రస్తుతం ఐపీఎల్‌ టాప్ బౌలర్లలో ఒకడు.. ఎవరో తెలుసా..?

IPL 2021: ఖాన్ వచ్చాడంటే రసెల్‌ ఔట్‌..! దుమ్ము లేపుతున్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌..?