- Telugu News Photo Gallery Spiritual photos Jammu and kashmir devotees offer prayers at mata vaishno devi shrine on 1st day of navratri
Vaishno Devi’s Navaratri 1stday: కరోనా నిబంధనల మధ్య ప్రారంభమైన వైష్ణవిదేవి అమ్మవారి శార్దియా నవరాత్రి వేడుకలు
హిందువుల ఆరాధ్య దైవం. ప్రముఖ మాతా వైష్ణోదేవి ఆలయంలో శార్దియా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వతంలో కొలువైన అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. వైష్ణవీదేవిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు కోరారు.
Updated on: Apr 13, 2021 | 10:31 AM

ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వేలాది మంది యాత్రికులు నవరాత్రాలలో మాతా వైష్ణో దేవిని సందర్శిస్తారు, అయితే ఈ సంవత్సరం COVID-19 కేసుల సంఖ్య పెరగడం వల్ల, శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికుల రక్షణ కోసం ప్రయాణం సులభతరం చేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. . వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. దేవస్థానం బోర్డ్ అన్ని ఏర్పాట్లు చేసింది. రంగు రంగుల విద్యుద్దీపాలు, గులాబీలు, ఆర్కిడ్, బంతి పువ్వులతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దింది.

వైష్ణవదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజేషన్ చేయడంతో పాటు భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. 'నవరాత్రి' మొదటి రోజున ఘనంగా పూజలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి 'దర్శనం' కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ఆలయంలోకి ప్రవేశించాలంటే. తప్పనిసరిగా కరోనా టెస్టులను నిర్వహించుకున్న RT-PCR నివేదికను సమర్పించాలని కోరారు.

దేశం లో కరోనా సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజేషన్ చేయడంతో పాటు భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ కరోనా వైరస్ బారినుంచి మానవాళి బయటపడాలని కొందరు భక్తులు కోరుతున్నారు.

శార్దియా నవరాత్రి సందర్భంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి హారతి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కళాకరులు భజనలతో పాటు భైంట్ ప్రదర్శనలు చేపట్టానున్నారు. అలాగే లోక కల్యాణార్థం శత చండి మహాయాగం సైతం నిర్వహించనున్నారు. ఉత్సవాలను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది.

శరద్ (శరదృతువు) నవరాత్ర వేడుకలను వైష్ణవి దేవి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గాదేవిని.. తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజులలో, భక్తులు దుర్గాదేవిని అత్యంత భక్తితో పూజిస్తారు. ర్గాదేవి మహిషాసుర అనే రాక్షసుడిపై విజయం సాధించినందుకు గుర్తుగా శరద్ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. చెడుపై మంచి విజయానికి గుర్తు అని భక్తుల నమ్మకం.




