Holi 2021: హోలీ రంగుల నుంచి మీ గోళ్ళను ఈ విధంగా కాపాడుకోండి.. ఈ టిప్స్ ఫాలో అయితే మీ నెయిల్స్ భద్రమే..
Holi 2021: హోలీ వచ్చిందంటే చాలు.. చిన్నా, పెద్దా తేడా లేకుండా సంబరాలు చేసుకుంటుంటారు. వయసుతో తారతమ్యం లేకుండా.. రంగులను
Holi 2021: హోలీ వచ్చిందంటే చాలు.. చిన్నా, పెద్దా తేడా లేకుండా సంబరాలు చేసుకుంటుంటారు. వయసుతో తారతమ్యం లేకుండా.. రంగులను చల్లుకుంటుంటారు. ఇక హోలీ సంబరాల్లో పాల్గొనేముందు చాలా మంది తమ చర్మ సంరక్షణ గురించి.. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచిస్తుంటారు. హోలీ వేడుకలలో వాడే రసాయనిక రంగుల నుంచి తమ చర్మాన్ని, జుట్టుు కాపాడుకోవడం కోసం కావల్సిన ప్రొడక్ట్ కోసం నెట్టింట్లో వెతుకులాట ప్రారంభించే ఉంటారు. ఇక చర్మ సంరక్షణ తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సింది గోళ్ళను. ఈ కెమికల్ కలర్స్ నుంచి మీ చర్మంతో పాటు నెయిల్స్ కూడా కాపాడుకోవడం ముఖ్యమే. అయితే ఈ గోళ్లను శుభ్రం చేసుకోవడానికి మార్కెట్లో లభించే రకారకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉండే పదార్థాలతో చక్కగా గోళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం మరీ ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా లేదండోయ్. నెయిల్స్ శుభ్రం చేసుకోవడానికి కాస్తా సమయం వెచ్చిస్తే చాలు.. సులువుగా మీ గోళ్లను అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందామా.
హోలీ రంగుల నుంచి మీ గోళ్లను రక్షించుకోండిలా..
— హోలీకి ఒక రాత్రి ముందుగా మీ గోళ్ళను డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోండి. ఎందుకంటే హోలీ వేడుకలో మీ మీద రంగు పడినా.. అది గోళ్లపై మచ్చగా ఉండిపోకుండా.. నెయిల్ పాలీష్ కాపాడుతుంది. కానీ గుర్తుంచుకోండి.. డార్క్ కలర్ నెయిల్ పెయింట్‌ను ఒకటి కంటే ఎక్కువ పొరలుగా వేయడం వలన ఈ ఫలితం కనిపిస్తుంది.
— ఇక పొడవు నెయిల్స్ ఉన్నవారు.. గోళ్ళ పైన మాత్రమే నెయిల్ పెయింట్ వేయకుండా.. లోపలి సైడ్ కూడా నెయిల్ పాలిష్ వేయడం మంచింది. ఎందుకంటే.. మీరు రంగులు పడకుండా.. చేతులను అడ్డుపెట్టినప్పుడు గోళ్లలోకి రంగు పోయినా.. మచ్చలు పడవు.
— హోలీ పండగకు ముందు కొన్ని రోజుల నుంచే మీ గోళ్లను ప్రిపేర్ చేసుకోండి. ఇందుకోసం ప్రతి రోజు రాత్రి కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన గోళ్లు విరిగిపోకుండా..బలంగా తయారవుతాయి.
— ఇక హోలీ సంబరాల్లో పాల్గోనే కొన్ని క్షణాల ముందు మీ బాడీతోపాటు గోళ్ళకు కూడా వాసెలిన్ లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. ఒకవేళ మీ పై రంగు పడినా.. రంగు శరీరానికి, గోళ్లకు పట్టుకోని ఉండదు.
గోళ్ళ నుంచి హోలీ రంగులను ఎలా తీసివేయాలి..
— ముందుగా కొన్ని నిమ్మకాయల రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో మీ చేతులను 5 నుంచి 7 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే గోళ్ళపై రంగులు సులభంగా పోతాయి.
— ఒకవేళ నిమ్మకాయ అందుబాటులో లేకపోతే.. కొబ్బరి నూనెలో మీ చేతులను నానబెట్టి.. రంగులు పడిన చోట నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన సులభంగా రంగు పోగొట్టవచ్చు.
— హోలీ సంబరాల తర్వాత మీ గోళ్లకు కావాల్సిన రక్షణ ఇవ్వడం ద్వారా మీ నెయిల్స్ అందంగా కనిపిస్తాయి.
Also Read:
హోలీ వచ్చేస్తుంది.. ఎలాంటి డ్రెస్సులు ధరించాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకోసమే ఈ ఐడియాస్..
Holi Festival: హోలీ పండుగ కోసం సిద్ధమవుతున్నారా ? నిపుణుల సూచనలు బ్యూటీ టిప్స్ ఇవే..