Natural Hair Removal: చిన్నారి శరీరంపై జట్టుని తొలగించడానికి సహజమైన, సురక్షితమైన పద్ధతులు ఏమిటంటే..?
నవ జాత శిశువు చాలా సున్నితంగా ఉంటుంది. వీరికి సున్నితమైన రక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇక చంటి పిల్లల ఒంటి మీద ఉన్న జుట్టుని తొలగించడానికి పూర్వం పెద్దలు సహజ పద్దతులను ఉపయోగించేవారు. ..
Natural Hair Removal: నవ జాత శిశువు చాలా సున్నితంగా ఉంటుంది. వీరికి సున్నితమైన రక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇక చంటి పిల్లల ఒంటి మీద ఉన్న జుట్టుని తొలగించడానికి పూర్వం పెద్దలు సహజ పద్దతులను ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం ఆధునిక విజ్ఞానం అంటూ రసాయన వస్తువులను ఉపయోగిస్తున్నారు. అయితే చిన్నారుల శరీరానికి కెమికల్స్ వాడకం హాని కలిస్తుందని.. సహజమైన పద్ధతులు మేలు అంటున్నారు. సహజంగా చిన్నారులకు ఒంటి మీద జుట్టు తల్లిదండ్రుల జీన్స్ బట్టి వస్తుంది. వీటిని చిన్న చిన్న చిట్కాల ద్వారా తొలగించవచ్చు.. అవి ఏమిటో ఒక్కసారి చూద్దాం..!
* పాలు పసుపు కలిపి శిశువు చర్మం పై మసాజ్ చేయండి. అది ఎండిపోయిన తర్వాత మెత్తటి టవల్ ని పాలల్లో ముంచి క్లీన్ చెయ్యండి.ఈ పధ్ధతి లో స్నానం చేయించినప్పుడు సబ్బు వాడాల్సిన అవసరం ఉండదు. జుట్టు త్వరగా తొలగిపోతుంది.
*ముందుగా చిన్నారి శరీరానికి ఆయిల్ అప్లై చేయండి.. తర్వాత శుభ్రమైన శనగపిండిని ఒంటి మీద రాసి ఆ తర్వాత వరి పిండి తో నలచండి. ఇలా చేస్తే.. శరీరం సున్నితంగా అవుతుంది. ఇక జుట్టు కూడా ఊడిపోతుంది.
* గంథం పొడిలో కొంచెం పాలు, కొంచెం పసుపు వేసి ఓ మిశ్రమంగా తయారు చేయండి.. దానిని జుట్టు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి.. రెండు గంటల తర్వాత స్నానం చేయించండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే .. చిన్నారి ఒంటిపై ఉన్న జుట్టు ఊడిపోతుంది.
* ముందు ఎర్రకంది పప్పు, పాలు కలిపి మిక్సీ పట్టండి.. తర్వాత చిన్నారి శరీరం పై ఆలివ్ ఆయిల్ ను రాసి.. దానిపై ఏఈ మిశ్రమాన్ని రుద్దండి.. ఇలా చేస్తే త్వరగా జుట్టు ఊడిపోతుంది. చర్మం నిగనిలాడుతుంది.
Also Read: 200 ఏళ్ల క్రితం ఆ గ్రామ జనాభా రాత్రికి రాత్రే మాయం… ఇప్పటికీ ఇల్లు కట్టని జనం