Haunted Village Kuldhara: 200 ఏళ్ల క్రితం ఆ గ్రామ జనాభా రాత్రికి రాత్రే మాయం… ఇప్పటికీ ఇల్లు కట్టని జనం
అపురూప కట్టడాలు, కోటలు, వారసత్వ రాజభవనాలు, విభిన్న సంస్కృతులకు పెట్టింది పేరు మనదేశం. ఇక వింతలూ విడ్డూరాలు, భయం కరమైన సంఘటనలు .. రహస్యభరిత ప్రదేశాలకు..
Haunted Village Kuldhara: అపురూప కట్టడాలు, కోటలు, వారసత్వ రాజభవనాలు, విభిన్న సంస్కృతులకు పెట్టింది పేరు మనదేశం. ఇక వింతలూ విడ్డూరాలు, భయం కరమైన సంఘటనలు .. రహస్యభరిత ప్రదేశాలకు నిలయం. ఒళ్లు గగుర్పొడిచే దెయ్యాల కథలు నిజంగా జరిగినట్లు చరిత్ర చెబుతుంటే.. అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ రాజస్థాన్ లో 200 ఏళ్ల క్రితం చోటు కథను చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే…
రాజస్థాన్ లో అనాదరణకు గురైన ఈ గ్రామం జైసల్మేర్ నుంచి పదిహేడు కిమీ దూరంలో ఉంది. ఈ గ్రామం వేల సంవత్సరాల పాటు వందలాది మంది జనాభాను కలిగి ఉండేది. అయితే సుమారు 200 ఏళ్ల క్రితం ఒకానొక రాత్రి ఆ గ్రామంలో ఉన్న మొత్తం జనాభా ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా మాయమైపోయారు. ఆ ఊరి దివాన్ బెదిరింపులకు భయపడి రాత్రికి రాత్రే 84 గ్రామాల ప్రజలు మాయం అయిపోయారు.. ఆ గ్రామ ప్రజలపై దాడి జరిగినట్లుగాని, ఎటువంటి అనూహ్య సంఘటనలు జరిగినట్లు ఎటువంటి ఆనమాలు లేవు.. కానీ ఆ గ్రామ ప్రజలంతా ఎక్కడి వెళ్లారో ఏమైపోయారో ఎవరికి తెలియదట. అయితే ఆ గ్రామ ప్రజలు ఏమైపోయారో తెలుసుకోవడానికి వెళ్ళిన వారు ఎవరికీ అంతుపట్టని విధంగా మరణించారు. ఈ సంఘటన జరిగి రెండు వందల ఏళ్ళకు పైగా అయినా ఇప్పటికీ ఆ గ్రామం లో కాదు కదా.. చుట్టూ పక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి ఎవరూ సాహసించడంలేదు. ఇక దెయ్యాలపై పరిశోధనలు చెయ్యడానికి వెళ్ళిన వారికి అక్కడ విచిత్రమైన పరిస్థితులు అనుభవాలు ఎదురయ్యాయని చెబుతారు. అందుల్లనే ఈ గ్రామంలోకి సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మాత్రమే పర్యాటకులు సందర్శించడానికి అనుమతిస్తారు. 200 సంవత్సరాల నాటి మట్టి ఇల్లు ఇక్కడ చూడవచ్చు.
ఈ గ్రామంలో 500 సంవత్సరాల పాటు పాలివాల్ బ్రాహ్మణులు వుండేవారు. అక్కడి క్రూరమైన పాలకులు వాళ్ళను గ్రామ౦ వదలివెళ్ళమని బలవంతం చేసారు. అందువలన, ఆ గ్రామం పాలివాల్ బ్రాహ్మణులచే శపించ బడిందని చరిత్రలో ఉన్న కథనం
అయితే స్థానికుల కథనం ప్రకారం, అప్పట్లో జాలిమ్ సింగ్ అనే మంత్రి గ్రామపెద్ద కూతుర్ని వివాహం చేసుకోదలిచాడు. కానీ, స్థానిక ప్రజలు ఈ వివాహాన్ని నిరాకరించారు. కక్ష కట్టిన జాలిమ్ సింగ్, గ్రామస్థులను హింసించి, పన్నులు పెంచేసాడు. దీంతో గ్రామస్తులు గ్రామాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వెళ్తూ ఆ ఊరిని శపించారు, అందుకే అప్పటి నుంచి కుల్ధారాతో సహా, చుట్టుపక్కల ఉండే ఎనభై నాలుగు గ్రామాలు ఖాళీగానే దర్శనమిస్తాయి.
Also Read: వారానికి 4 రోజుల పని దినాలు.? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వివరాలివే.!