AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ఆర్ఎస్ఎస్ ని ‘సంఘ్ పరివార్’ అని పిలిస్తే ఒట్టు ! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

రాష్ట్రీయ సంఘ్ పరివార్ (ఆర్ఎస్ఎస్)  ని తాను ఇకపై సంఘ్ పరివార్ అని వ్యవహరించబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. సంఘ్ పరివార్ అంటే మహిళలు, గౌరవప్రదులైన పెద్దలు, మమతానురాగాలతో కూడిన కుటుంబమని, కానీ ఆర్ఎస్ఎస్ లో ఇవేవీ లేవని ఆయన చెప్పారు.

ఇకపై ఆర్ఎస్ఎస్ ని 'సంఘ్ పరివార్' అని పిలిస్తే ఒట్టు ! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
Rahul Gandhi
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 25, 2021 | 4:31 PM

Share

రాష్ట్రీయ సంఘ్ పరివార్ (ఆర్ఎస్ఎస్)  ని తాను ఇకపై సంఘ్ పరివార్ అని వ్యవహరించబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. సంఘ్ పరివార్ అంటే మహిళలు, గౌరవప్రదులైన పెద్దలు, మమతానురాగాలతో కూడిన కుటుంబమని, కానీ ఆర్ఎస్ఎస్ లో ఇవేవీ లేవని ఆయన చెప్పారు. యూపీలో కేరళకు చెందిన నలుగురు నన్స్ ని కొంతమంది  మూక రైల్లో వేధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఒక మతాన్ని మరో మతానికి వ్యతిరేకంగా ఉసి గొల్పి, మైనారిటీలను కూడా వేధిస్తున్నారని ఆయన అన్నారు. అసలు సంఘ్ పరివార్ అంటే ఓ చక్కని కుటుంబమని, కానీ ఆర్ ఎస్ ఎస్ లో ఈ గుణాలేవీ లేవని ఆయన ట్వీట్ చేశారు.

కేరళకు చెందిన నలుగురు నన్స్  ఈ నెల 19 న ఢిల్లీ నుంచి ఒడిశా లోని తమ సొంత ప్రాంతం రూర్కెలాకు ఉత్కల్ ఎక్స్ ప్రెస్ లో వెళ్తుండగా బజరంగ్ దళ్ కు చెందినవారిగా  చెబుతున్న కొంతమంది సభ్యులు, మరి కొంతమంది పోలీసులు సైతం వారిని వేధించినట్టు వార్తలు వచ్చాయి. మత మార్పిడులు చేస్తున్నారని వారిపై ఆరోపణలు మోపి వారిని బలవంతంగా రైలు  నుంచి దింపివేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే తాము ఎలాంటి మత మార్పిడులకు పాల్పడలేదని వారు ఎంతగా చెప్పినా బజరంగ్ దళ్ సభ్యులు వినలేదని తెలిసింది. చివరకు కేరళ సీఎం పినరయి  విజయన్  కి ఈ సమాచారం తెలిసీ ఈ ఘటన గురించి హోం మంత్రి అమిత్ షాకు లేఖ ద్వారా  తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి తగిన చర్య తీసుకోవలసిందిగా ఉన్నతాధికారులను , రైల్వే అధికారులను  ఆదేశించారు. చివరకు ఆ నన్స్ క్షేమంగా తమ గమ్యానికి బయల్దేరి వెళ్లారు. కాగా ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని బజరంగ్ దళ్ ప్రకటించింది.  తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి: AP Corona Cases: ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. ఏకంగా 758 కేసులు.. పెరిగిన మరణాల సంఖ్య

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల

Follow Us
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..