Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం… ఏప్రిల్ 6న నిధుల విడుదల

సీఎం జగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా  ప్రజలకు సంక్షేమం అందిస్తూ.. ఆయన ముందుకు సాగుతున్న తీరుకు ప్రశంసలు లభిస్తున్నాయి.

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం... ఏప్రిల్ 6న నిధుల విడుదల
Cm Jagan
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Mar 25, 2021 | 6:25 PM

సీఎం జగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా  ప్రజలకు సంక్షేమం అందిస్తూ.. ఆయన ముందుకు సాగుతున్న తీరుకు ప్రశంసలు లభిస్తున్నాయి. కాగా ముఖ్యమంత్రి చాలా ఎమోషనల్ పర్సన్ అని ఆయనకు దగ్గరగా మెలిగేవాళ్లు చెప్పే మాట. తాజాగా తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు సీఎం జగన్.  బీమా లేకున్నా, పెద్ద మనసుతో కుటుంబ పెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు ఏప్రిల్‌ 6న ప్రభుత్వ నిధుల నుంచి 258 కోట్లు ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.

వైఎస్సార్‌ బీమా పథకానికి అర్హత ఉండి, దాని పరిధిలో రాకుండానే మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రూల్స్ ప్రకారం బీమా వర్తించడానికి అవకాశంలేని ఈ ఫ్యామిలీలకు కూడా భరోసా కల్పించేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 12,039 కుటుంబాలకు భరోసా కల్పించినట్లవుతుందని అధికారులు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విధివిధానాలతో ముఖ్యమంత్రి జగన్‌ గత 2020 అక్టోబరు 21న వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు.. అమలులో ఉన్న బీమా పథకానికి కేంద్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఆపివేయడంతో ఈ పథకానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ పేదలకు ఉచిత బీమాను అందజేస్తోంది. దీని ద్వారా సాధారణ, ప్రమాదవశాత్తు మరణించిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. పథకం ప్రారంభమైన తేదీ తర్వాత ఈ స్కీమ్‌కు అర్హత ఉండి, రూల్స్ ప్రకారం బీమా పరిధిలోకి రాకుండానే.. ఇప్పటివరకు 11,022 మంది సాధారణ పరిస్థితులతో మృతిచెందినట్లు, మరో 1,017 మంది ప్రమాదవశాత్తు చనిపోవడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని అధికారులు గుర్తించారు.

నిజానికి.. వైఎస్సార్‌ బీమా పథకంలో పేర్లు నమోదైన ఒకొక్కరి తరఫున ఆయా బ్యాంకులకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ఏపీ సర్కార్ చెల్లించింది. అయితే, బ్యాంకుల్లో నమోదు ప్రక్రియ పూర్తికాకుండా ఇందుకు అర్హత ఉన్నవారు మొత్తం 12,039 మంది చనిపోయారు. వీరు సంబంధిత బీమా సంస్థలు, బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందే వీలులేని జాబితాలో ఉండిపోయారని అధికారులు చెప్పారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ వీరిపట్ల ఉదారంగా వ్యవహరించి వారి ఫ్యామిలీలను ఆదుకునేందుకు నిర్ణయించినట్లు వారు తెలిపారు.

వీరికి ప్రత్యేకంగా ప్రభుత్వ నిధులు నుంచి ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. కాగా, ఈ 12,039 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లు ఖర్చు చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు వెల్లడించారు.

ఏప్రిల్‌ 6న సీఎం చేతుల మీదుగా సాయం

వైఎస్సార్‌ బీమా పథకం లబ్దిదారులకు ఏప్రిల్‌ 6న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ 12,039 కుటుంబాలకు ఆ రోజున రూ.258 కోట్ల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు సెర్ప్‌ అధికారులు తెలిపారు.

వైఎస్సార్‌ బీమా సాయం ఇలా..

  • 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి సాధారణ మరణం పొందితే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు
  • 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిస్థాయి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు..
  • 51–70 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిస్థాయి అంగవైకల్యం పొందితే రూ.3 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

Also Read: YS Jagan – Chiranjeevi: ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి వివరాలు

పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

 ఏప్రిల్‌ 1 నుంచి బాదుడే.. బాదుడు.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి…కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!