Kim Jong Un: పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Kim Jong Un Punishment: ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జగమెరిగిన సత్యం...

Kim Jong Un: పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Kim Jong-un
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 24, 2021 | 4:31 PM

Kim Jong Un Punishment: ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జగమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. పోర్న్ చూస్తూ పట్టుబడిన ఓ బాలుడికి భయంకరమైన శిక్ష విధించాడు ఈ నార్త్ కొరియా డిక్టేటర్. వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల కాలంలో ఉత్తర కొరియా ప్రభుత్వం పోర్న్‌కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది. అధికార వర్కర్స్ పార్టీ పాఠశాలల్లో అశ్లీలతకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను షురూ చేసింది. ఉత్తర కొరియాలో మత్తు పదార్ధాల విక్రయించినా.. కొనుగోలు చేసినా.. సదరు వ్యక్తులకు మరణశిక్ష విధించేలా చర్యలు తీసుకున్నారు.

నియంత కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశంలో పోర్న్ చూడటం.. సమాజాన్ని నాశనం చేయడం రెండూ ఒకటే. ఈ నేపధ్యంలో అక్కడ పోర్న్‌పై నిషేధం విధించారు. అయితే అనూహ్యంగా ఓ బాలుడు పోర్న్ చూస్తూ అడ్డంగా దొరికాడు. కంప్యూటర్ ఐపీ అడ్రెస్ ద్వారా అతడి ఇంటి చిరునామాను పోలీసులు ట్రేస్ చేశారు.

ఇక ఈ విషయం నియంత కిమ్ వరకు చేరడంతో ఆయన ఆ బాలుడికి, అతని కుటుంబానికి భయంకరమైన శిక్షను విధించాడు. ఆ కుటుంబాన్ని నార్త్ కొరియా నుంచి వెలివేయడమే కాకుండా సరిహద్దు ప్రాంతానికి తరిమేశాడు. బాలుడిని ఉరి తీయకపోవడం అదృష్టం అని అక్కడి స్థానిక మీడియా ఓ కథనాన్ని వ్యక్తం చేసింది. అటు ఆ బాలుడు చదివిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు సైతం కిమ్ శిక్షను విధించాడు. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం, పాఠశాల పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దానికి పాఠశాల ప్రిన్సిపాలే బాధ్యత వహించాలి. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్‌కు శిక్ష విధిస్తూ.. అతన్ని కార్మిక శిబిరానికి పంపించారు.

Also Read:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…