Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

Razole MLA Rapaka Varaprasada Rao: గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే..

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!
Rapaka
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 22, 2021 | 1:57 PM

Razole MLA Rapaka Varaprasada Rao: గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. అయితే గెలిచిన దగ్గర నుంచి జనసేన పార్టీ సిద్దాంతాలను, విధానాలను పక్కన పెట్టి అవకాశం దొరికనప్పుడల్లా సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా అధికార పార్టీకి తన మద్దతు తెలుపుతూ పలు సందర్భాలులో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో రాపాక వరప్రసాదరావు తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదే కోవలో తాజాగా రాపాకపై రాజోలు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

రాజోలు నియోజకవర్గం మల్కిపురంలో సోమవారం జనసేన పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, జిల్లా నాయకులు ఈ సభకు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే జనసైనికులు సోషల్ మీడియా వేదికగా రాపాక వరప్రసాదరావుకు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా జనసైనికులు ఫ్లెక్సీలను పలు చోట్ల ఏర్పాటు చేశారు. ”తాము ఏర్పాటు చేసిన సభకు రాపాకకు అనుమతి లేదంటూ ఆ ఫ్లెక్సీ” ద్వారా పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు స్థానికంగా హాట్ టాపిక్ అయ్యాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!