Gold Rates Today: బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…

Gold And Silver Price: దేశీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ దారుణంగా పడిపోతోంది. కరోనా సంక్షోభ సమయంలో పీక్స్ రేంజ్‌లోకి వెళ్లిన బంగారం..

Gold Rates Today: బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా...
Gold And Silver Rates
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 23, 2021 | 5:09 AM

Gold And Silver Price: దేశీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ దారుణంగా పడిపోతోంది. కరోనా సంక్షోభ సమయంలో పీక్స్ రేంజ్‌లోకి వెళ్లిన బంగారం ధరలు.. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక.. నేల చూపులు చూస్తున్నాయి. గత కొన్ని నెలలుగా పసిడి ధరలు వరుసగా పతనమవుతూనే ఉన్నాయి. బంగారం ధరలు పడిపోవడానికి దేశీయంగా డిమాండ్ తగ్గడం ఒక కారణం అయితే.. అంతర్జాతీయంగా డాలర్ రేట్ తగ్గడం కూడా ఒక కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా, దేశీయంగా పుత్తడి ధరలు భారీగా దిగొస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే దరిదాపు రూ. 4 వేల వరకు తగ్గింది.

తాజాగా ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 200 తగ్గింది. దాంతో ప్రస్తుతం 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 48,220 పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,200 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే ధరలు ఇదే విధంగా ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 45,880 ఉండగా.. 22 క్యారెట్స్ విలువైన బంగారం ధర రూ. 42,050 పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోనూ బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి. ఇక్కడ మేలిమి బంగారం ధర రూ. 45,880 పలుకుతుండగా.. 22 క్యారెట్ల పుత్తడి రేట్ రూ. 42,050 గా ఉంది. విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే.. 10 గ్రాముల మేలైన బంగారం ధర రూ. 45,880 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ. 42,050 గా ఉంది. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ గోల్డ్ ధర 1,731 డాలర్లకు పడిపోయింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో మెలిమి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. చెన్నై: 22 క్యారెట్స్: రూ. 42,120 24 క్యారెట్స్: రూ. 45,950 ముంబయి: 22 క్యారెట్స్: రూ. 43,800 24 క్యారెట్స్: రూ. 44,800 కోల్‌కతా: 22 క్యారెట్స్: రూ. 44,540 24 క్యారెట్స్: రూ. 47,210 బెంగళూరు: 22 క్యారెట్స్: రూ. 42,050 24 క్యారెట్స్: రూ. 45,880

ఇదిలాఉండగా సిల్వర్ ధరల పర్థితి కూడా అలాగే ఉంది. కిలో వెండి ధర ఏకంగా రూ. 900 పడిపోయింది. దాంతో ప్రస్తుతం కిలో వెండి ఢిల్లీ మార్కెట్‌లో రూ.66,600 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,000 పలుకకుతోంది. బెంగళూరులో రూ. 67,500, ముంబైలో రూ. 66,600, చెన్నైలో రూ. 70,000, విజయవాడలో రూ. 70,000, విశాఖపట్నంలో రూ. 70,000 చొప్పున పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి 25.55 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Also read:

Google: గూగుల్‌కు ఊహించని షాక్.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కీలక వ్యక్తి.. అసలు కారణమిదేనా?

Donald Trump: మరో సంచలనానికి తెర లేపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్, ఫేస్‌బుక్ టార్గెట్‌గా..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ