AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: గూగుల్‌కు ఊహించని షాక్.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కీలక వ్యక్తి.. అసలు కారణమిదేనా?

Google: ప్రముఖ సెర్చ్ ఇంజిన్.. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్‌కు ఊహించని షాక్ తగిలింది. గూగుల్ అభివృద్ధిలో తొలి నుంచీ పాలుపంచుకున్న

Google: గూగుల్‌కు ఊహించని షాక్.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కీలక వ్యక్తి.. అసలు కారణమిదేనా?
SenGupta
Shiva Prajapati
|

Updated on: Mar 23, 2021 | 4:58 AM

Share

Google: ప్రముఖ సెర్చ్ ఇంజిన్.. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్‌కు ఊహించని షాక్ తగిలింది. గూగుల్ అభివృద్ధిలో తొలి నుంచీ పాలుపంచుకున్న కీలక వ్యక్తి ఆ కంపెనీకి గుడ్‌బై చెప్పారు. అతనే సీజర్ సేన్ గుప్తా. గూగుల్ వైస్‌ ప్రెసిడెంట్‌గా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సీజర్ సేన్ గుప్తా ప్రకటించారు. గుప్తా గూగుల్‌కు దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించారు. ఈ పదిహేనేళ్ల కాలంలో గూగుల్‌కు సంబంధించి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించారు. వాటి అభివృద్ధి కోసం ఎంతగానో శ్రహించారు. గూగుల్‌కు చెందిన క్రోమ్ ఓఎస్, గూగుల్ పే, నెక్స్ బిలియన్ యూజర్స్ వంటి ప్రాజెక్టుల ప్రారంభం మొదలు.. వాటి అభివృద్ధిలో గుప్తా కృషి ఎనలేనిదని చెప్పాలి. గూగుల్ అభివృద్ధి కోసం ఇంత చేసిన గుప్తా.. తాజాగా తన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు.

ప్రస్తుతం సేన్ గుప్తా.. గూగుల్ వైస్‌ ప్రెసిడెంట్ మాత్రమే కాదు.. జనరల్ మేనేజర్‌ గానూ వ్యవహరిస్తున్నారు. ఈ పదవులకు రాజీనామా చేస్తున్నానని, ఏప్రిల్ 30వ తేదీ చివరి తేదీని సేన్ గుప్తా ప్రకటించారు. అయితే, తన నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని గుప్తా వెల్లడించారు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని గుప్తా నిర్ణయించుకున్నారట. ఆ కారణంగానే గూగుల్‌కు గుడ్‌ బై చెప్పారని కంపెనీ ప్రకటించారు. ఇంతకాలం గూగుల్‌కు తన అమోఘమైన సేవలు అందించినందుకు అభినందించిన గూగుల్.. గుప్తా కొత్త ప్రయాణం సక్సెస్ కావాలని ఆకాంక్షించింది. ఆ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇదిలాఉంటే.. సీజర్ సేన్ గుప్తా చేపట్టే కొత్త వ్యాపారం ఏంటనేది మాత్రం గుప్తా గానీ.. గూగుల్ కానీ వెల్లడించలేదు.

Also read:

Donald Trump: మరో సంచలనానికి తెర లేపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్, ఫేస్‌బుక్ టార్గెట్‌గా..

Telangana CM: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ప్రాజెక్టు నిర్మాణంపై కీలక ఆదేశాలు..

Facebook disabled:130 కోట్ల నకిలీ ఖాతాలు ఔట్.. కోటికి పైగా పోస్టులు, వీడియోలను తొలగించిన ఫేస్ ‌బుక్