AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: మరో సంచలనానికి తెర లేపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్, ఫేస్‌బుక్ టార్గెట్‌గా..

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనను బహిష్కరించిన సోషల్ మీడియా..

Donald Trump: మరో సంచలనానికి తెర లేపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్, ఫేస్‌బుక్ టార్గెట్‌గా..
Donald Trump
Shiva Prajapati
|

Updated on: Mar 23, 2021 | 1:44 AM

Share

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనను బహిష్కరించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు గట్టి షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. వాళ్లు నన్ను బహిష్కరించడం ఏంటి.. నేనే వారిని బహిష్కరిస్తున్నాను అంటూ.. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఇదే అంశం అమెరికా అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. అవును అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఉన్న ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్‌, ఇతర సోషల్ మీడియా సాధనాలకు పోటీగా సొంతంగా సోషల్ మీడియా యాప్స్‌ను తీసుకురావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. మరో రెండు మూడు నెలల్లో డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని చూస్తున్నట్లు ఆయన సలహాదారుడైన జాసన్ మిల్లెర్ వెల్లడించారు. ఈ వ్యవస్థ ప్రస్తుతమున్న యాప్స్‌ కంటే ఎంతో మెరుగైందిగా ఉంటుందన్నారు. ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకునేలా, చాలా భారీగా ప్లాన్స్ వేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు సమావేశాలు కూడా జరిగాయన్నారు. అయితే, ట్రంప్ సొంత సోషల్ మీడియా యాప్స్‌‌కు సంబంధించిన వివరాలను మిల్లెర్ పెద్దగా వెల్లడించలేదు. యాప్స్‌ను ఎప్పుడు మార్కెట్‌లోకి విడుదల చేస్తారు.. ఎలాంటి యాప్స్‌ను తీసుకురాబోతున్నారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైట్‌హౌస్‌ టార్గెట్‌గా జనవరి 6వ తేదీన ట్రంప్ మద్ధతుదారుల ముట్టడికి పాల్పడిన విషయం తెలిసిందే. జో బెడైన్ అధ్యక్ష ఎన్నికను నిరసిస్తూ ట్రంప్ మద్దతు దారులు దాదాపు 800 మందికి పైగా కాపిటల్ ‌బిల్డింగ్‌‌ను ముట్టడించారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ చేసిన ప్రచారం కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని భావించిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్, ఇతర యాప్స్‌ ట్రంప్ అకౌంట్లను బ్లాక్ చేశాయి. ట్రంప్ తప్పుడు సమాచారన్ని ప్రచారం చేస్తున్నారని, అతని పోస్టులు హింసను ప్రేరిపిస్తున్నాయంటూ ట్రంప్ ఖాతాలను తాత్కాలికంగా మూసివేశారు. అయితే, నిషేధాన్ని కొనసాగించాలా? వద్దా? అనేది ఆయా సంస్థలకు చెందిన పర్యవేక్షణ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న ట్రంప్.. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్‌కు ధీటైన యాప్స్‌ను తానే సొంతంగా తీసుకురావాలని ట్రంప్ తలంచారు. ఆ మేరకు కార్యాచరణను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ముందడుగు వేసిన ట్రంప్.. యాప్స్‌ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Also read:

IPL 2021: అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టారు.. దూమ్మురేపుతున్నారు.. ‘క్వారంటైన్’‌ సాంగ్ విడుదల చేసిన కేకేఆర్

Telangana CM: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ప్రాజెక్టు నిర్మాణంపై కీలక ఆదేశాలు..