AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టారు.. దుమ్మురేపుతున్నారు.. ‘క్వారంటైన్’‌ సాంగ్ విడుదల చేసిన కేకేఆర్

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు తమ అభిమానుల కోసం స్పెషల్‌ ఐపీఎల్‌ 'క్వారంటైన్'‌ సాంగ్‌(Kuch din ki yeh majboori hai)ను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించగా.. ఈ సీజన్‌లోనూ అదే పరిస్థితి నెలకొననుంది.

IPL 2021: అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టారు.. దుమ్మురేపుతున్నారు.. 'క్వారంటైన్'‌ సాంగ్ విడుదల చేసిన కేకేఆర్
Kkr Song
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 23, 2021 | 6:28 AM

Share

ఎంట్రీతోనే ప్రాక్టీస్ మొదలు పెట్టారు… ప్రాక్టీస్‌లోనే దుమ్మురేపుతున్నారు.. సీజన్ తమే అంటూ సత్తా చాటేందుకు తగ చెమటో ఇండియన్ ప్రీమియర్ లీగ్​ కోసం కోల్​కతా నైట్ రైడర్స్​ ఆటగాళ్లు ముంబైకి చేరుకున్నారు. ఈ విషయాన్ని కేకేఆర్ ధ్రువీకరించింది. ప్రాక్టీస్​ సెషన్లలో పాల్గొనడానికి ముందు వారం రోజుల పాటు తప్పనిసరి కఠిన క్వారంటైన్​లో క్రికెటర్లు ఉండనున్నారు.

ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-14 )‌ 2021 కోసం ఆయా జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంచైజీ ఇప్పటికే ప్రాక్టీస్‌ ప్రారంభించగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు మార్చి 31 నుండి ట్రైనింగ్‌ సెషన్‌ను ప్రారంభించనుంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కూడా త్వరలోనే తమ ట్రైనింగ్‌ క్యాంప్‌ను ప్రారంభింస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బంది ఏడు రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని కోల్‌కతా జట్టు యాజమాన్యం ప్రకటించింది. అందుకు ఏర్పాట్లు కూడా చేసింది.

లీగ్​కు ముందు క్రికెటర్లంతా వారం రోజుల పాటు తప్పనిసరి కఠిన క్వారంటైన్​లో ఉండాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్​తో సిరీస్​లో పాల్గొన్న ప్లేయర్లను మాత్రం నేరుగా బబుల్​లోకి ప్రవేశించే అవకాశం కల్పించింది బీసీసీఐ. మాజీ కెప్టెన్ దినేశ్​ కార్తీక్​, వరుణ్​ చక్రవర్తి, రాహుల్​ త్రిపాఠి, కమలేష్​ నాగర్​కోటి, సందీప్ వారియర్, వైభవ్​ అరోరాతో పాటు సహాయ కోచ్​ అభిషేక్​ నాయర్​, సహాయ బౌలింగ్ కోచ్ ఓంకార్ సాల్విలు ముంబైకి చేరుకున్నారు.”ఇది క్వారంటైన్ సమయం. ఐపీఎల్​ కోసం కేకేఆర్​ ముంబైకి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో క్యాంప్​​ ప్రారంభం కానుంది.” అని కేకేఆర్​ తన అధికారిక ట్విట్టర్​లో పేర్కొంది.

అయితే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు తమ అభిమానుల కోసం స్పెషల్‌ ఐపీఎల్‌ ‘క్వారంటైన్’‌ సాంగ్‌(Kuch din ki yeh majboori hai)ను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించగా.. ఈ సీజన్‌లోనూ అదే పరిస్థితి నెలకొననుంది.

ఇవి కూడా చదవండి:  TS PRC Calculator 2021: పీఆర్‌సీలో మీకు పెరిగిన జీతం ఎంతో తెలుసా.. అయితే ఈ క్యాలిక్యులేటర్‌తో చూసుకోండి..!

Alert ! LIC: ఎల్ఐసీ ఖాతాదారులకు ముఖ్య సూచన..ఈ ఫారం నింపకపోతే మీ డబ్బులు ఇరుక్కుపోతాయి..